ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం(డిసెంబర్ 15) నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 173.90 పాయింట్లు (0.38%) క్షీణించి 46079.56 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 45.40 పాయింట్లు (0.33%) తగ్గి 13512.80 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 743 షేర్లు లాబాల్లో, 557 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 51 షేర్లలో ఎలాంటి మార్పులేదు. పీఎస్‌యూ బ్యాంకు సూచీ 2 శాతం మేర, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, మెటల్ సూచీలు ఒక శాతం చొప్పున క్షీణించాయి. విదేశీ మారకం డాలర్ 73.64 వద్ద ప్రారంభమైంది. సోమవారం 73.57 వద్ద క్లోజ్ అయింది.

గెయిన్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్ 2.56 శాతం, శ్రీసిమెంట్స్ 1.92 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.55 శాతం, విప్రో 0.99 శాతం, HCL టెక్ 0.92 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్ 2.11 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.86 శాతం, SBI 1.84 శాతం, ITC 1.78 శాతం, హెచ్‌యూఎల్ 1.69 శాతం ఉన్నాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.
రిలయన్స్ స్టాక్ నేడు మరింత క్షీణించింది. నిన్న రూ.1991.30 వద్ద క్లోజ్ అయింది. నేడు ఉదయం గం.10.40 సమయానికి సెన్సెక్స్ 1.21 శాతం తగ్గి రూ.1,967.15 వద్ద క్లోజ్ అయింది.

ఆ రికార్డుల నుండి కిందకు...
నిన్న సెన్సెక్స్, నిఫ్టీలు జీవన కాలగరిష్టాన్ని తాకాయి. దీంతో ఇన్వెస్టర్లు నేడు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లు నష్టాల్లో ఉండటానికి ఇది కూడా కారణం. ఉదయం గం.10.45 సమయానికి సెన్సెక్స్ 360 పాయింట్లు క్షీణించి 45,895 వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 46,000 పాయింట్ల దిగువకు వచ్చింది. నిఫ్టీ కూడా 96 పాయింట్లు క్షీణించి 13,500 దిగువకు వచ్చింది. ఉదయం 13,463 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా..
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ 50 సూచీ 0.69 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.74 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.15 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.06 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.01 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.64 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.44 శాతం, నిఫ్టీ ఐటీ 0.24 శాతం, నిఫ్టీ మీడియా 0.93 శాతం, నిఫ్టీ మెటల్ 0.70 శాతం, నిఫ్టీ ఫార్మా 0.01 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.58 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.36 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.95 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications