For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరుసగా 4వరోజు నష్టాల్లో మార్కెట్, ఈ స్టాక్స్ 15% జంప్

|

స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సూచీలు వరుసగా నాలుగో రోజు నష్టపోయాయి. ఓవైపు ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు అమెరికా ఫెడ్ రిజర్వ్ ఉద్దీపనల ఉపసంహరణ వైపు అడుగులు వేయనుందనే సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. అలాగే వడ్డీరేట్లను సైతం సాధ్యమైనంత త్వరలో పెంచే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తముతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు నేడు పూర్తిగా అప్రమత్తంగా వ్యవహరించారు. నేడు FIIలు నికర విక్రయదారులుగా నిలిచారు. ఇటీవల మార్కెట్లో లిస్ట్ అయిన పలు ఇంటర్నెట్ ఆధారిత కంపెనీల షేర్లు భారీ నష్టాల్లో ట్రేడ్ కావడం ప్రభావం చూపించింది. బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, రిలయన్స్ వంటి దిగ్గజ షేర్లు డీలాపడటం సూచీలను దెబ్బతీసింది. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ముగిశాయి. అమెరికా ఫ్యూచర్స్, ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా ఉన్నాయి. దీంతో నేడు సూచీలు నష్టపోయాయి.

ఉదయం నుండి నష్టాల్లోనే..

ఉదయం నుండి నష్టాల్లోనే..

సెన్సెక్స్ నేడు ఉదయం 58,122.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,218.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,671.61 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,323.65 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,351.20 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకి, 17,192.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

సెన్సెక్స్ చివరకు 329.06 (0.57%) పాయింట్లు ఎగిసి 57,788.03 పాయింట్ల వద్ద, నిఫ్టీ 103.50 (0.60%) పాయింట్లు లాభపడి 17,221.40 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేడు ఏ సమయంలోను లాభాల్లోకి రాలేదు. ఉదయం ఆరంభంలోనే కాస్త లాభాల్లో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత పడిపోయింది. ఇక ఏ దశలో కోలుకోలేదు.

పవర్, ఫార్మా రంగాలు లాభపడగా, ఆటో రంగం మాత్రం నష్టపోయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో సన్ ఫార్మా, కొటక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, హీరో మోటో కార్ప్ ఉన్నాయి. నేటి టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, ఐటీసీ ఉన్నాయి.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, కొటక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఐటీసీ ఉన్నాయి.

డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 76.23 వద్ద ముగిసింది. ఏప్రిల్ 24, 2020 తర్వాత ఇదే అత్యంత కనిష్టం.

ఈ స్టాక్స్ 15 శాతం జంప్

ఈ స్టాక్స్ 15 శాతం జంప్

మార్కెట్లు నష్టపోయినప్పటికీ నేడు పలు స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. ఎథేనా కన్‌స్ట్రక్షన్స్ (20.0%), బిల్వారా స్పిన్ (20.0%), అల్పాలాజిక్ టెక్ సిస్ (20.0%), SBL ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ (20.0%), రా ఎడ్జ్ ఇండస్ట్రియల్ (20.0%), CMI FPE(20.0%), వాల్సన్ ఇండ్ (20.0%), KIOCL(19.99%), SAL ఆటోమోటివ్ (19.98%), సువిధా ఇన్ఫో సర్వ్ లిమిటెడ్ (19.98%) వంటి స్టాక్స్ 15 శాతానికి పైగా లాభపడ్డాయి.

English summary

వరుసగా 4వరోజు నష్టాల్లో మార్కెట్, ఈ స్టాక్స్ 15% జంప్ | Sensex slips for 4th day, ends 329 points lower ahead of Fed outcome

Among the sectors, power, pharma and oil & gas ended in the green while auto, FMCG and PSU Bank index ended in the red.
Story first published: Wednesday, December 15, 2021, 18:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X