భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 300 పాయింట్లు డౌన్
స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ఉన్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం, చమురు ధరల పెరుగుదల భయాల కారణంగా ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. అమెరికా సహా యూరోపియన్ మార్కెట్లు క్షీణించాయి. దీంతో నేడు భారత్ సహా ఆసియా మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా ద్రవ్యోల్భణం గత నాలుగు దశాబ్దాల్లోనే అత్యంత దారుణ ద్రవ్యోల్భణాన్ని నమోదు చేసింది.
దీంతో మార్కెట్లు ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడి నష్టాల్లోకి వెళ్లింది. సెన్సెక్స్ ఉదయం 57,801.72 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,845.37 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,249.97 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,289.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,294.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,119.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12.20 సమయానికి సెన్సెక్స్ -277.06 (0.50%) పాయింట్లు నష్టపోయి 57,307.95 పాయింట్ల వద్ద, నిఫ్టీ -88.20 (0.51%) పాయింట్లు క్షీణించి 17,134.55 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఆటో, రిలయన్స్, యూపీఎల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, కొటక్ మహీంద్రా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, మారుతీ సుజుకీ, సిప్లా, పవర్ గ్రిడ్ కార్ప్, ఐవోసీ ఉన్నాయి.


Click it and Unblock the Notifications