ముంబై: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం (మే 4) భారీ నష్టాల్లో ప్రారంభమై, మధ్యాహ్నం సమయానికి లాభాల్లోకి వచ్చాయి. కీలక రంగాల షేర్లు రాణిస్తుండండం సూచీల సెంటిమెంటును బలపరిచాయి. అమెరికా మార్కెట్లు క్రితం సెషన్లో లాభాల్లో ముగిశాయి.ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. కరోనా భయాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగమనం నేపథ్యంలో సూచీలపై ప్రభావం చూపుతాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.74.89 వద్ద ట్రేడ్ అయింది.

భారీ నష్టాల నుండి లాభాల్లోకి...
సెన్సెక్స్ నేడు 48,881.63 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,996.53 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,521.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ 124 (0.26%) పాయింట్లు లాభపడి 48,843 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ కూడా స్వల్ప లాభాల్లో ఉంది. నిఫ్టీ 14,687.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,723.40 వద్ద గరిష్టాన్ని, 14,580.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1 సమయానికి నిఫ్టీ 30 (0.21%) పాయింట్లు ఎగిసి 14,664 పాయింట్ల వద్ద కదలాడింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 3.34 శాతం, SBI 3.18 శాతం, బీపీసీఎల్ 2.70 శాతం, SBI లైఫ్ ఇన్సురా 2.49 శాతం, కొటక్ మహీంద్రా 1.94 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్ 3.72 శాతం, సిప్లా 2.93 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.77 శాతం, సన్ ఫార్మా 1.52 శాతం, రిలయన్స్ 1.12 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, రిలయన్స్, ఎస్బీఐ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.15 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.28 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.00 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.35 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.46 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.92 శాతం, నిఫ్టీ ఐటీ 0.18 శాతం, నిఫ్టీ మీడియా 1.21 శాతం, నిఫ్టీ మెటల్ 0.14 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 6.07 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.67 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.21 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.18 శాతం, నిఫ్టీ ఫార్మా 1.25 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications