ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (డిసెంబర్ 28) భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 47,200 పాయింట్లకు పైగా ఓపెన్ అయింది. ఆ కాసేపటికి 47,300ను తాకింది. నిఫ్టీ 13,800కు పైన ట్రేడ్ అయింది. అమెరికా ప్యాకేజీ, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలత నేపథ్యంలో ఆసియా మార్కెట్లు, భారత సూచీలు మంచి లాభాల్లో ఉన్నాయి. హాంగ్‌కాంగ్, కోస్పి, జకర్తా, సింగపూర్, జపాన్ నిక్కీ స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 12.85 శాతం లేదా 0.02 శాతం ఎగిసింది. శుక్రవారం మార్కెట్‌కు సెలవు రోజు. మొత్తం నాలుగు రోజులు మార్కెట్లు నడిచాయి.

మార్కెట్లు జంప్
ఆటో, బ్యాంక్, మెటల్, ఇన్ఫ్రా స్టాక్స్ భారీగా ఎగిసిపడటంతో సూచీలు పైపైకి చేరాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 314.32 పాయింట్లు (0.67%) లాభపడి 47287.86 పాయింట్ల వద్ద, నిఫ్టీ 94.50 పాయింట్లు (0.69%) ఎగిసి 13843.80 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
1213 షేర్లు లాభాల్లో, 228 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 77 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఉదయం గం.11 సమయానికి సెన్సెక్స్ 260 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ ఓ సమయంలో 13,860ను తాకింది. డాలర్ మారకంతో రూపాయి 73.52 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. గత వారం 73.54 వద్ద క్లోజ్ అయింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్లు కనిపించాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 3.89 శాతం, JSW స్టీల్ 2.62 శాతం, SBI లైఫ్ ఇన్సురెన్స్ 2.33 శాతం, HDFC లైఫ్ 2.24 శాతం, అదానీ పోర్ట్స్ 2.06 శాతం లాభాల్లో ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HUL 0.42 శాతం, HCL టెక్ 0.26 శాతం, ఐచర్ మోటార్స్ 0.18 శాతం, బ్రిటానియా 0.22 శాతం, HDFC 0.05 శాతం నష్టపోయాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి.

రంగాలవారీగా
రంగాలవారీగా నిఫ్టీ 50 స్టాక్స్ 0.58 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.35 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.94 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.03 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.64 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.85 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.14 శాతం, నిఫ్టీ ఐటీ 0.14 శాతం, నిఫ్టీ మీడియా 0.89 శాతం, నిఫ్టీ మెటల్ 1.61 శాతం, నిఫ్టీ ఫార్మా 0.03 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.53 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.02 శాతం, నిఫ్టీ ప్రయివేటు 1.15 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications