క్రూడాయిల్ షాక్, రూ.5 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు
భారత స్టాక్ మార్కెట్ సోమవారం (మార్చి 7) భారీ నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ బ్యాంక్, రియాల్టీ 4 శాతం నుండి 5 శాతం చొప్పున పడిపోయింది. సెన్సెక్స్ నేడు 53,172 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,203 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,367 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకి, చివరకు 1491 పాయింట్లు తగ్గి 52,842 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ ఓ సమయంలో 2000 పాయింట్ల వరకు క్షీణించింది. నిఫ్టీ 15,868 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,944 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,711 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 382 పాయింట్లు క్షీణించి 15,863 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టపోయాయి. డాలర్ మారకంతో రూపాయి 77 వద్ద ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ 30 స్టాక్స్‌లో ఐదు మాత్రమే లాభాల్లో ముగిశాయి. భారతీ ఎయిర్టెల్, హెచ్‌సీఎల్ టెక్, ట్టా స్టీల్, ఇన్ఫోసిస్, ఐటీసీ లాభాల్లో ముగిశాయి. మిగతా 25 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంకు 8 శాతానికి పైగా, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంకు బజాజ్ ఫిన్ సర్వ్ 6 శాతానికి పైగా నష్టపోయాయి.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ ప్రభావం జాతీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ పైన పడి, నష్టాల్లో ముగిశాయి. రూపాయి ఆల్ టైమ్ గరిష్టానికి పడిపోయింది. సెన్సెక్స్ 1500 పాయింట్ల వరకు నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లకు పైగా పడిపోయింది.


Click it and Unblock the Notifications