ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. ఈ రోజు డే హై 477 పాయింట్లు పడిపోయింది. సెన్సెక్స్ 24.58 పాయింట్లు నష్టపోయి 37,663 పాయింట్లు, నిఫ్టీ 6.40 పాయింట్లు లాభపడి 11,101.70 వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి 74.94 వద్ద ముగిసింది. మెటల్, ఆటో, ఇన్ఫ్రా, ఐటీ రంగాలు లాభాల్లో ముగియగా, ఎనర్జీ, ఫార్మా అమ్మకాలు చవిచూశాయి.

400 పాయింట్లకు పైగా ఎగిసి..
ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా ఎగిసింది. ఓ సమయంలో 38,140 పాయింట్లను తాకింది. అయితే మధ్యాహ్నం నుండి లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నష్టాల్లోకి వెళ్లింది. నిఫ్టీ కూడా ఊగిసలాట మధ్య సాగింది. 11,226 నుండి 11,064 మధ్య ఊగిసలాడింది. మార్కెట్లు క్లోజ్ అయ్యే సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో, టాటా స్టీల్, ఐచర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, పవర్ గ్రిడ్ కార్ప్, రిలయన్స్ ఉన్నాయి.

బలపడిన రూపాయి
డాలర్ మారకంతో రూపాయి బలపడింది. గత సెషన్‌లో 75.04 వద్ద ముగిసింది. ఈ రోజు 74.93 వద్ద ప్రారంభమైంది. 74.83 నుండి 74.95 మధ్య కదలాడింది. చివరకు 74.94 వద్ద ముగిసింది. నిన్నటి కంటే 10 పైసలు లాభపడింది. ఈక్విటీ మార్కెట్లలో సానుకూల ధోరణి, బలహీనపడిన అమెరికా కరెన్సీ, మార్కెట్లోకి ఫారెన్ ఫండ్ ఇన్‌ఫ్లో తదితర అంశాలు రూపాయి బలపడటానికి కారణాలు. మంగళవారం ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (FPI) క్యాపిటల్ మార్కెట్ నుండి రూ.703.74 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

నష్టాల్లో దిగ్గజాలు
ఎన్ఎస్ఈలో మెటల్ ఇండెక్స్ 4 శాతానికి పైగా, ఆటో 2 శాతానికి పైగా, మీడియా ఒక శాతానికి పైగా లాభపడింది. ఫార్మా 0.3 శాతం నష్టపోయింది. బ్లూచిప్స్ ఆపిల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, విప్రో, రిలయన్స్, హెచ్‍సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్ర, ఇన్పోసిస్, ఐటీసీలు భారీగా నష్టపోయాయి.
మంగళవారం FPIలు దాదాపు రూ.704 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా, దేశీ ఫండ్స్ (DII)లు రూ.666 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. సోమవారం FPIలు రూ.7,818 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. డీఐఐలు రూ.136 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించాయి.


Click it and Unblock the Notifications