ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (నవంబర్ 27) నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుండి ఒడిదుడుకుల్లోనే ఉన్నాయి. అడపాదడపా లాభాల్లోకి రావడం మినహా ఈ రోజు ఎక్కడా పుంజుకోలేదు. సెన్సెక్స్ 110.02 పాయింట్లు(0.25%) క్షీణించి 44,149.72 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు(0.14%) తగ్గి 12,969 పాయింట్ల వద్ద ముగిసింది. 1717 షేర్లు లాభాల్లో, 1039 షేర్లు నష్టాల్లో ముగియగా, 172 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఆటో, పీఎస్‌యూ బ్యాంకింగ్ ఒక్కో శాతం చొప్పున లాభపడగా, మిగతా రంగాలు నష్టపోయాయి. నిన్న దాదాపు 700 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఈ రోజు మరో 100 పాయింట్లకు పైగా నష్టపోయింది.

రిలయన్స్ స్టాక్ మరింత పతనం
టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 3.80 శాతం, హీరో మోటో కార్ప్ 2.79 శాతం, ఏషియన్ పేయింట్స్ 2.78 శాతం, టైటాన్ కంపెనీ 2.55 శాతం, బ్రిటానియా 2.51 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.66 శాతం, JSW స్టీల్ 2.51 శాతం, HCL టెక్ 2.37 శాతం, ఓఎన్జీసీ 2.12 శాతం, HDFC లైఫ్ 2.12 నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో కొటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఈ రోజు మరింత పడిపోయింది. 0.62 శాతం తగ్గి రూ.1,940.50 వద్ద ముగిసింది. గత కొద్ది రోజులుగా రిలయన్స్ స్టాక్ పతనమవుతోంది. కొద్ది రోజుల క్రితం రూ.2300 దాటిన ఈ స్టాక్ ఈ గరిష్టంతో రూ.350కి పైగా తక్కువతో ఉంది.

ఎక్కువ రంగాలు లాభాల్లో ముగిసినా...
10 సెన్సెక్స్ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ భారీ నష్టానికి రిలయన్స్, టీసీఎస్, నెస్ట్లే కారణం. నెస్ట్లే 4 శాతం నష్టపోగా, ఏషియన్ పేయింట్స్ 2 శాతం లాభపడింది. అత్యంత నష్టపోయిన రంగాల్లో బీఎస్ఈ ఎనర్జీ ఉంది. రియాల్టీ బెస్ట్ పర్ఫార్మర్. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు రెండు శాతం చొప్పున ఎగిశాయి.
నిఫ్టీ 50 స్టాక్స్ 0.14 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 2.70 శాతం లాభపడింది.
నిఫ్టీ ఆటో 1.41 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.20 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.39 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.06 శాతం, నిఫ్టీ మీడియా 1.48 శాతం, నిఫ్టీ మెటల్ 0.02 శాతం, నిఫ్టీ ఫార్మా 0.32 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.26 శాతం, నిఫ్టీ రియల్టీ 2.65 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.50 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఎనర్జీ 0.58 శాతం, నిఫ్టీ ఐటీ 0.43 శాతం నష్టపోయాయి.
ఎక్కువ రంగాలు లాభాల్లో ముగిసినా, సూచీలో ఎక్కుు వెయిటేజీ కలిగిన ఎనర్జీ, ఐటీ స్టాక్స్ నష్టపోయాయి.

ఐటీ స్టాక్స్ డౌన్
ఐటీ స్టాక్స్ విషయానికి వస్తే టీసీఎస్ స్టాక్ 1.57 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.24 శాతం, ఇన్ఫోసిస్ 0.076 శాతం, విప్రో 1.10 శాతం, కోఫోర్జ్ 1.89 శాతం నష్టపోయాయి. టెక్ మహీంద్రా 1.16 శాతం, మైండ్ ట్రీ 1.61 శాతం మాత్రం లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ సూచీలు మంచి లాభాలు నమోదు చేశాయి. నగదు విభాగంలో గురువారం FIIలు రూ.2,027 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, దేశీ ఫండ్స్-DIIలు రూ.3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం FPIలు నామమాత్రంగా రూ.24 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. DIIలు రూ.1,840 కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications