ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (డిసెంబర్ 16) భారీ లాభాల్లో ముగిశాయి. కరోనా మహమ్మారి టీకా అందుబాటులోకి రావడం, విదేశీ పెట్టుబడుల వెల్లువతో బుధవారం సూచీలు పరుగులు పెట్టాయి. ఉదయం సెన్సెక్స్ 288.89 పాయింట్లు(0.62%) లాభపడి 46552.06 పాయింట్ల వద్ద, నిఫ్టీ 83.50 పాయింట్లు (0.62%) లాభపడి 13651.40 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత ఏ దశలోను సూచీలు వెనక్కి తగ్గలేదు. మధ్యాహ్నం గం.1కి 46,423 పాయింట్లకు దిగి వచ్చినప్పటికీ, ఆ తర్వాత అంతకు మించి పుంజుకుంది. చివరకు 400 పాయింట్లకు పైగా లాభంతో ముగిసింది.

సరికొత్త శిఖరాలకు.. 47,000 దిశగా సెన్సెక్స్
సెన్సెక్స్ 403.29 పాయింట్లు(0.87%) ఎగిసి 46,666.46 పాయింట్ల వద్ద, నిఫ్టీ 114.80 పాయింట్లు(0.85%) లాభపడి 13,682.70 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1801 షేర్లు లాభాల్లో, 1129 షేర్లు నష్టాల్లో ముగియగా 164 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్, నిఫ్టీలు నేడు సరికొత్త శిఖరాలను తాకాయి. నవంబర్ నెల నుండి సూచీలు దాదాపు ప్రతి వారం కొత్త రికార్డును నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్ 46,666 వద్ద ఉంది. అంటే 47,000ను ఈ ఏడాది ముగిసే నాటికి అందుకునే అవకాశాలు లేకపోలేదు.
డాలర్ మారకంతో రూపాయి స్వల్పంగా లాభపడి 73.58 వద్ద క్లోజ్ అయింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్లు పెరగడంతో రూపాయి బలపడింది. ఉదయం 17 పైసల లాభంతో 73.47 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్లో 73.64 వద్ద క్లోజ్ అయింది. నేడు 73.47-73.60 మధ్య ట్రేడ్ అయింది. రియాల్టీ ఏకంగా 5 శాతానికి పైగా లాభపడింది.

ఈ స్టాక్స్ జంప్
PSU బ్యాంకింగ్ రంగం మినహా మిగతా అన్నిరంగాలు లాభాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.8 శాతం చొప్పున లాభపడ్డాయి. ఆటో, మెటల్ రంగాలు మంచి లాభాలు నమోదు చేశాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో HDFC 3.16 శాతం, హిండాల్కో 2.82 శాతం, దివిస్ ల్యాబ్స్ 2.47 శాతం, ONGC 2.44 శాతం, టైటాన్ కంపెనీ 2.43 శాతం లాభపడ్డాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో ICICI బ్యాంకు 1.08 శాతం, NTPC 0.90 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 0.85 శాతం, గెయిల్ 0.68 శాతం, టెక్ మహీంద్రా 0.59 శాతం నష్టాల్లో ముగిశాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి.
రిలయన్స్ స్టాక్ నేడు 0.16 శాతం లాభపడి రూ.1977.55 వద్ద ముగిసింది. మహీంద్రా షేర్ ధర 1.88 శాతం ఎగిసి రూ.731.45 వద్ద క్లోజ్ అయింది.

రంగాలవారీగా చూస్తే...
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ 50 స్టాక్స్ 0.85 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1.22 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.98 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.02 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.59 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.79 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.67 శాతం, నిఫ్టీ ఐటీ 0.84 శాతం, నిఫ్టీ మీడియా 0.30 శాతం, నిఫ్టీ మెటల్ 1.79 శాతం, నిఫ్టీ ఫార్మా 0.92 శాతం, నిఫ్టీ రియాల్టీ 5.14 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.10 శాతం లాభపడ్డాయి. అయితే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.63 శాతం నష్టపోయింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications