సరికొత్త రికార్డ్ సృష్టించిన సూచీలు: ఎప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చు?
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం(ఆగస్ట్ 10) లాభాల్లో ముగిశాయి. గతవారం మొదటి నాలుగు సెషన్లలో భారీగా లాభపడిన సూచీలు, చివరి సెషన్‌లో మాత్రం నష్టపోయింది. నిన్న సూచీలు తిరిగి కోలుకున్నాయి. ఈ రోజు కూడా సూచీలు సరికొత్త రికార్డుకు చేరుకున్నాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 54,780 పాయింట్లకు చేరువైంది. నిఫ్టీ 1,360 పాయింట్లను సమీపించింది. ఉదయం నుండి భారీ లాభాల్లో కనిపించిన మార్కెట్లు ఆ తర్వాత మధ్యాహ్నం గం.2 సమయంలో నష్టాల్లోకి జారుకున్నప్పటికీ కాస్త తేరుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 151.81 (0.28%) పాయింట్లు లాభపడి 54,554.66 పాయింట్ల వద్ద, నిఫ్టీ 21.85 (0.13%) పాయింట్లు ఎగిసి 16,280.10 పాయింట్ల వద్ద ముగిసింది.
54,461.31 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 54,779.66 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,308.77 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. 16,274.80 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ, 16,274.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,202.25 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో నేటి ట్రేడింగ్‌ను ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా కాస్త నష్టాల్లోకి వెళ్లడంతో ఆరంభ లాభాల్లో కొంత కోల్పోవాల్సి వచ్చింది. దీంతో స్వల్ప లాభాల్లో ముగిశాయి. అయినప్పటికీ సరికొత్త రికార్డులో సూచీలు ముగిశాయి. బ్యాంకింగ్, ఫార్మా, రియల్టీ రంగ షేర్ల అండతో సూచీలు ఉదయం ఉత్సాహంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
రంగాల వారీగా చూస్తే ఐటీ రంగం మినహా దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. నిఫ్టీ మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సూచీలు రెండు శాతానికి పైగా క్షీణించాయి. స్మాల్‌క్యాప్ 2 శాతం, మిడ్ క్యాప్ 1 శాతం పడిపోయింది. నిఫ్టీలో ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, HDFC, కొటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు రాణించాయి. శ్రీ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, IOC షేర్లు నష్టపోయాయి.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో భారతీ ఎయిర్ టెల్, HDFC, SBI, టాటా స్టీల్, రిలయన్స్ ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్ 3.83 శాతం, టెక్ మహీంద్రా 2.77 శాతం, HDFC 1.82 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 1.82 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.46 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో శ్రీ సిమెంట్స్ 4.09 శాతం, JSW స్టీల్ 3.37 శాతం, టాటా స్టీల్ 2.73 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.18 శాతం, ఐవోసీ 2.06 నష్టపోయాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో పదిహేను లాభాల్లో ముగిశాయి.
మార్కెట్లు ప్రస్తుతం జోరు మీద ఉన్నాయని హెమ్ సెక్యూరిటీస్ మోహిత్ నిగమ్ అన్నారు. గత కొద్ది సెషన్లుగా మార్కెట్లు పరుగులు పెడుతున్నాయని, నిఫ్టీ తదుపరి నిరోధకస్థాయి 16400 అని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లు దూకుడు మీద ఉన్నప్పటికీ ప్రాఫిట్ బుకింగ్, ఇతర కారణాలతో కిందకు పడిపోయే అవకాశాలు కొట్టి పారేయలేమని, అలాంటి సందర్భంలో ఇన్వెస్ట్‌మెంట్ వైపు ఆలోచించవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications