స్టాక్ మార్కెట్లు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని(2022-23)లో లాభాలతో ప్రారంభించింది. సెన్సెక్స్ నిన్న 58,568 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు స్వల్ప నష్టాల్లో 58,530 పాయింట్ల వద్ద ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత అంతకంతకూ ఎగిసిపడింది. నేడు ఓ సమయంలో 59,000 మార్కును క్రాస్ చేసింది. సెన్సెక్స్ నేడు 59,023 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,450 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2.07 సమయానికి సెన్సెక్స్ 415 పాయింట్లు (0.71 శాతం) ఎగిసి 58,984 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 113 పాయింట్లు లేదా 0.65 శాతం ఎగిసి 17,578 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
ఐటీ, ఫార్మా రంగాలు మినహా అన్ని రంగాలు లాభాల్లోనే ఉన్నాయి. బ్యాంకింగ్, రియాల్టీ, ఆయ్ల్ అండ్ గ్యాస్, పవర్, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు ఒక శాతం నుండి 3 శాతం వరకు లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక శాతం చొప్పున ఎగిశాయి. మధ్యాహ్నం గం.2.15 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో ఎన్టీపీసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ లాభాల్లో ఉన్నాయి. హీరో మోటోకార్ప్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, టెక్ మహీంద్రా, సిప్లా, దివిస్ ల్యాబ్స్ నష్టాల్లో ఉన్నాయి.

2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద సెన్సెక్స్ 9059 పాయింట్లు లేదా 18.29, నిఫ్టీ 2774 పాయింట్లు లేదా 18.88 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ గత ఏడాది వ్యవధిలో రూ.204 లక్షల కోట్ల నుండి రూ.264 లక్షల కోట్లకు చేరుకుంది. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.60 లక్షల కోట్లు పెరిగింది.


Click it and Unblock the Notifications