ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం(జనవరి 5) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఓ సమయంలో సెన్సెక్స్ 48,000 పాయింట్ల దిగువకు పడిపోయినప్పటికీ ఆ తర్వాత కోలుకుంది. ప్రారంభంలో 200 పాయింట్లకు పైగా నష్టపోయినప్పటికీ తిరిగి పుంజుకుంది. అయినా నష్టాల్లోనే ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. నిన్న మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నష్టాల్లోకి వెళ్లాయి. ఆ తర్వాత కాస్త కోలుకొని స్థిరంగా కనిపిస్తోంది.

సెన్సెక్స్, నిఫ్టీ డౌన్
సెన్సెక్స్ ఉదయం గం.09:16 సమయానికి 183.10 పాయింట్లు(0.38%) క్షీణించి 47,993.70 పాయింట్ల వద్ద, నిఫ్టీ 56.90 పాయింట్లు (0.40%) క్షీణించి 14,076 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 581 షేర్లు లాభాల్లో, 1022 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 56 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
సెన్సెక్స్ ఓ సమయంలో 200 పాయింట్లకు పైగా నష్టపోయినప్పటికీ, ఉదయం గం.11.30 సమయానికి లాభాల్లోకి వచ్చింది. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో ఉండగా, నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయిి 14,122 వద్ద ట్రేడ్ అయింది.
డాలర్ మారకంతో రూపాయి 14 పైసలు క్షీణించి 73.16 వద్ద ప్రారంభమైంది. సోమవారం 73.02 వద్ద క్లోజ్ అయింది.
బిట్ కాయిన్ నేడు మరో 5 శాతం క్షీణించింది. అయినా 30.000 డాలర్లకు పైనే ఉంది. జనవరి 4న 15 శాతం వరకు నష్టపోయింది.

రిలయన్స్ మరింత డౌన్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు 3.46 శాతం, HDFC 2.35 శాతం, విప్రో 1.63 శాతం, టీసీఎస్ 1.37 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.07 శాతం లాభాల్లో ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్ 2.54 శాతం, హిండాల్కో 2.46 శాతం, JSW స్టీల్ 1.97 శాతం, IOC 1.86 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.82 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, టాటా స్టీల్, రిలయన్స్ ఉన్నాయి.
రిలయన్స్ షేర్ నేడు మరింత క్షీణించి రూ.1970 వద్ద ట్రేడ్ అయింది.

నిఫ్టీ మెటల్ డౌన్
నిఫ్టీ 50 స్టాక్స్ స్థిరంగా ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.25 శాతం లాభపడింది. నిఫ్టీ బ్యాంకు 0.51 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.46 శాతం, నిఫ్టీ ఐటీ 1.08 శాతం, నిఫ్టీ మీడియా 0.36 శాతం, నిఫ్టీ ఫార్మా 0.45 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.02 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.54 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఆటో 0.70 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.02 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.11 శాతం, నిఫ్టీ మెటల్ 1.48 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.11 శాతం నష్టపోయాయి.
నిన్న భారీగా లాభపడిన నిఫ్టీ మెటల్ ఈ రోజు నష్టపోయింది. ఇన్వెస్టర్లు లాభాలకు మొగ్గు చూపడంతో నష్టాల్లోకి వెళ్లింది.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications