ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (డిసెంబర్ 15) ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, రిలయన్స్ ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి అధిక వెయిటేజీ కలిగిన స్టాక్స్ పతనం కావడంతో ఉదయం మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆ తర్వాత కోలుకుంది. చివరకు అతి స్వల్ప లాభాలతో ముగిసింది. నిన్న మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. దీంతో ఉదయం ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగారు. ప్రారంభంలో భారీ నష్టాలకు ఇది కూడా ఓ కారణం. చివరి గంటలో మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ చివరి గంటలో 421 పాయింట్లు పైకి ఎగిసింది.

ఇవి మినహా అన్నీ డౌన్
ఆటో, మెటల్ రంగం మినహా మిగతా అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు, ఎఫ్ఎంసీజీ ఒక శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ 9.71 పాయింట్లు(0.02%) లాభపడి 46,263.17 పాయింట్ల వద్ద, నిఫ్టీ 9.70 పాయింట్లు(0.07%) లాభపడి 13,567.90 పాయింట్ల వద్ద ముగిసింది.1389 షేర్లు లాభాల్లో, 1333 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 128 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఇక, విదేశీ మారకం డాలర్‌తో రూపాయి 73.64 వద్ద క్లోజ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 73.57 వద్ద ముగిసింది. నేడు స్వల్పంగా క్షీణించింది.

గెయినర్స్, లూజర్స్
నేటి మోస్ట్ గెయినర్స్ జాబితాలో... బజాజ్ ఫైనాన్స్, 4.57 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 4.07 శాతం, ఐచర్ మోటార్స్ 3.11 శాతం, జేఎస్‌డబ్ల్యు స్టీల్ 2.35 శాతం, శ్రీ సిమెంట్స్ 2.27 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో నెస్ట్లే 2.16 శాతం, హెచ్‌యూఎల్ 2.14 శాతం, బీపీసీఎల్ 1.69 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.47 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.43 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి.
రిలయన్స్ స్టాక్ నేడు మరింత పతనమైంది. క్రితం వారం రూ.2005 వద్ద ముగిసిన స్టాక్ నిన్న రూ.1991 వద్ద క్లోజ్ అయింది. నేడు 0.89 శాతం క్షీణించి రూ.1973.60 వద్ద క్లోజ్ అయింది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.07 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.77 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.62 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.77 శాతం, నిఫ్టీ మీడియా 1.79 శాతం, నిఫ్టీ మెటల్ 0.77 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 0.18 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.40 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.29 శాతం, నిఫ్టీ ఐటీ 0.14 శాతం, నిఫ్టీ ఫార్మా 0.22 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.46 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.31 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.03 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications