స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. వరుసగా రెండవ రోజు దేశీయ మార్కెట్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ బలహీన సంకేతాలతో పాటు దిగ్గజ రంగ షేర్లలో వెల్లువెత్తిన ప్రాఫిట్ బుకింగ్ కారణంగా సూచీలు కుదేలయ్యాయి. చివరలో కాస్త కొనుగోళ్లు కనిపించి, మార్కెట్లు కాస్త కోలుకొని, భారీ నష్టాలను తగ్గించుకున్నాయి. సెన్సెక్స్ నేటి నష్టాల నుండి 400 పాయింట్ల మేర పైకి వచ్చింది. మెటల్, బ్యాంకు స్టాక్స్ ఒత్తిడిలోకి వెళ్లాయి. పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ, మెటల్ సూచీలు ఒక శాతం నుండి రెండు శాతం మేర నష్టపోయాయి. ఆటో, పార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో కొనుగోళ్ల జోరు కనిపించింది.
విదేశీ పెట్టుబడుల మళ్లింపు, కీలక రంగాల షేర్లలో అమ్మకాలతో ఉదయం సూచీలు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 60,295.26 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 59,967.45 వద్ద గరిష్టాన్ని, 60,506.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,973.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,061.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,915.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 80.63 (0.13%) పాయింట్లు నష్టపోయి 60,352.82 పాయింట్ల వద్ద, నిఫ్టీ 27.05 (0.15%) పాయింట్లు క్షీణించి 18,017.20 పాయింట్ల వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, హిండాల్కో, టాటా స్టీల్, కోల్ ఇండియా, JSW స్టీల్ షేర్లు నష్టపోయాయి. ఎయిర్‌టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా, సన్ ఫార్మా షేర్లు లాభపడ్డాయి.
మార్కెట్ నష్టాల్లో ముగిసినప్పటికీ పలు స్టాక్స్ 15 శాతం మేర లాభపడ్డాయి. పదిహేను శాతానికి పైగా లాభపడిన వాటిలో FSN E-Commerce వెంచర్స్ లిమిటెడ్ (96.15%), షార్దూల్ Sec(19.99%), బ్లూ చిప్ టెక్స్(19.98%), విలియమ్సన్ మాగోర్ (19.93%), CFSL లిమిటెడ్ (19.59%), ఆష్కా హాస్పిటల్స్ లిమిటెడ్ (19.53%), సినర్జీ గ్రీన్ ఇండ్ (18.29%), యూనివర్సస్ ఫోటో (17.07%), క్రితి ఇండ్ (16.7%), మయుక్ డీల్ ట్రేడ్ (16.23%) ఉన్నాయి.


Click it and Unblock the Notifications