నష్టాల నుండి లాభాల్లోకి మార్కెట్లు: ఊగిసలాటలో..టాప్ గెయినర్స్ ఇవే..
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (డిసెంబర్ 23) లాభాల్లో ఉన్నాయి. ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 55.68 పాయింట్లు(0.12%) క్షీణించి 45951.01 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 19.80 పాయింట్లు(0.15%) పాయింట్లు నష్టపోయి 13446.50 వద్ద ప్రారంభమైంది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత లాభాల్లోకి వచ్చింది. ఆటో, ఐటీ, ఫార్మా రంగాలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. స్మాల్ క్యాప్ సూచీలు రెండు శాతం లాభపడ్డాయి. డాలర్ మారకంతో రూపాయి 73.89 వద్ద ప్రారంభమైంది. నిన్న 73.84 వద్ద క్లోజ్ అయింది. నేడు 5 పైసలు క్షీణతతో ప్రారంభమైంది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో 2.97 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.87 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.44 శాతం, సిప్లా 2.31 శాతం, బజా్ ఫిన్ సర్వ్ 2.13 శాతం లాభాల్లో ఉన్నాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో దివిస్ ల్యాబ్స్ 0.80 శాతం, HDFC 0.51 శాతం, HDFC లైఫ్ 0.40 శాతం, బ్రిటానియా 0.35 శాతం, రిలయన్స్ 0.18 శాతం నష్టపోయింది.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి.
మధ్యాహ్నంగం.10.45 సమయానికి సెన్సెక్స్ 230 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 58 పాయింట్ల లాభంలో ఉంది.
ఓ సమయంలో సెన్సెక్స్ 46,000 దిగువకు వచ్చి, ఆ తర్వాత 46,200 క్రాస్ చేసింది. మొత్తానికి మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికి ఊగిసలాటలో కనిపించాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.50 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.87 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.37 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.57 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.11 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.38 శాతం, నిఫ్టీ ఎప్ఎంసీజీ 0.57 శాతం, నిఫ్టీ ఐటీ 1.14 శాతం, నిఫ్టీ మీడియా 1.99 శాతం, నిఫ్టీ మెటల్ 0.65 శాతం, నిఫ్టీ ఫార్మా 0.98 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.44 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.39 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.63 శాతం లాభపడ్డాయి.రిలయన్స్ షేర్ నేడు 0.16 శాతం పతనమై 1933 వద్ద ట్రేడ్ అయింది.

నష్టాల నుండి లాభాల్లోకి..
కరోనా కొత్త స్ట్రేయిన్ వ్యాప్తీపై ఆందోళనతో ఇన్వెస్టర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు విమానాల రద్దు, అంతర్జాతీయంగా విధిస్తున్న లాక్ డౌన్‌లు మార్కెట్ పైన ఉదయం ప్రభావం చూపాయి. అయితే ఆ తర్వాత మార్కెట్లు కోలుకున్నాయి.


Click it and Unblock the Notifications