60,000 పాయింట్లు దాటిన సెన్సెక్స్: 12 రోజుల్లో రూ.20 లక్షల కోట్ల సంపద పెరిగింది

స్టాక్ మార్కెట్ బుధవారం(జనవరి 5) భారీ లాభాల్లో ముగిసింది. ప్రారంభంలో కాస్త తడబడినప్పటికీ ఆ మధ్యాహ్నం గం.11.30 నుండి అంతకంతకూ ఎగిసిపడింది. చాలా రోజులకు సెన్సెక్స్ కీలక 60,000 పాయింట్ల మార్కును క్రాస్ చేసింది. నిఫ్టీ 18,000కు కొద్ది దూరంలో నిలిచింది. కీలక రంగాలు రాణించాయి. అలాగే, హెవీ వెయిట్స్ లాభాలు సూచీలకు దన్నుగా నిలిచాయి. ప్రభుత్వరంగ ఇంధన సంస్థ నుండి రూ.545 కోట్ల ఆర్డర్ రావడంతో థర్మాక్స్ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 7 శాతం లాభపడ్డాయి. బ్యాంకింగ్ స్టాక్స్ అదరగొట్టాయి.

ఇవి సానుకూల అంశాలు

ఇవి సానుకూల అంశాలు

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు రాణించాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా కేసుల పెరుగుదల, పలు రాష్ట్రాల్లో ఆంక్షల వంటి ప్రతికూల సంకేతాలు సూచీల పరుగును ఆపలేకపోయాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి.

యూఎస్ ఫ్యూచర్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. కేంద్రం ప్రకటించిన తాజా కరోనా మార్గదర్శకాల్లో ఎలాంటి కఠిన నిబంధనలు లేకపోవడాన్ని మార్కెట్ సెంటిమెంటును బలపరిచింది. మరోవైపు కరోనా కేసుల నేపథ్యంలో ఆర్బీఐ మరికొంతకాలం సర్దుబాటు వైఖరిని కొనసాగించే అవకాశముంది. గత ఏడాది చివరలో నికర అమ్మకందారులు నిలిచిన విదేశీ ఇన్వెస్టర్లు కొత్త ఏడాదిలో తిరిగి భారత మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే బడ్జెట్ పైన ఆశలు, మూడో త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉండవచ్చుననే అంచనాలు ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపాయి.

12 రోజుల్లో రూ.20 లక్షల కోట్లు

12 రోజుల్లో రూ.20 లక్షల కోట్లు

గత పన్నెండు రోజుల్లో ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు. డిసెంబర్ 20వ తేదీ నాటి కనిష్టం నుండి సూచీలు దాదాపు 9 శాతం చొప్పున ఎగిశాయి. నవంబర్ తర్వాత మొదటిసారి సెన్సెక్స్ 60,000 మార్కు దాటింది. ఇటీవల 55,800 స్థాయికి పడిపోవడంతో ఆ డిప్ సమయంలో కొనుగోలు చేసిన వారికి మంచి రిటర్న్స్ వస్తాయి.

నాటి నుండి ఈ పన్నెండు రోజుల్లో సెన్సెక్స్ 4500 పాయింట్ల మేర లాభపడింది. ఈ కాలంలో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20 లక్షల కోట్లు పెరిగింది. డిసెంబర్ 20న రూ.252.57 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ జనవరి 5వ తేదీ నాటికి రూ.272.4 లక్షల కోట్లకు పెరిగింది.

మార్కెట్ జంప్

మార్కెట్ జంప్

సెన్సెక్స్ నేడు 59,921.98 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,332.72 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,661.38 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,820.10 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,944.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,748.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 367 పాయింట్లు ఎగిసి 60,223 పాయింట్ల వద్ద, నిఫ్టీ 120 పాయింట్లు లాభపడి 17,925 పాయింట్ల వద్ద ముగిసింది.

సెన్సెక్స్ వరుసగా నాలుగు రోజులు లాభపడింది. నిన్నటి వరకు మూడు రోజుల్లో 2100 పాయింట్ల వరకు లాభపడగా నేడు 367 పాయింట్లు ఎగిసింది. నాలుగు రోజుల్లో దాదాపు 2500 పాయింట్ల వరకు లాభపడింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+