ముంబై: బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ నేపథ్యంలో సోమవారం భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు మంగళవారం (డిసెంబర్ 22) కోలుకున్నాయి. నేడు ప్రారంభంలో హెచ్చుతగ్గులు చూసినప్పటికీ, ఆ తర్వాత లాభపడ్డాయి. దాదాపు అన్ని రంగాలు కూడా కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి వచ్చాయి. మధ్యాహ్నం గం.1.45 వరకు నష్టాల్లో కొనసాగిన సెన్సెక్స్, ఆ తర్వాత క్రమంగా ఎగిసి 450 పాయింట్లకు పైగా లాభంతో ముగిసింది.

కనిష్టం నుండి 894 పాయింట్లు జంప్
సెన్సెక్స్ ఈ రోజు 452.73 పాయింట్లు(0.99%) లాభపడి 46,006.69 వద్ద, నిఫ్టీ 137.90 పాయింట్లు(1.03%) ఎగిసి 13,466.30 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1537 షేర్లు లాభాల్లో, 1325 షేర్లు నష్టాల్లో ముగియగా,165 షేర్లలో ఎలాంటి మార్పులేదు. నిఫ్టీ ఐటీ 52 వారాల గరిష్టానికి చేరుకుంది. నిఫ్టీ నేటి కనిష్టం నుండి 273 పాయింట్లు ఎగిసింది. చివరకు 134 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ నేటి కనిష్టం నుండి 894 పాయింట్లు ఎగిసింది. చివరకు 453 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ బ్యాంకు నేటి కనిష్టం నుండి 649 పాయింట్లు ఎగిసింది. చివరకు 169 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ తిరిగి 46,000 పాయింట్ల పైకి చేరుకుంది.

ఐటీ స్టాక్స్ అదుర్స్
ఐటీ స్టాక్స్ నేడు దుమ్మురేపాయి. టీసీఎస్ 1.79 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 5.35 శాతం, ఇన్ఫోసిస్ 3.62 శాతం, టెక్ మహీంద్రా 4.10 శాతం, విప్రో 2.94 శాతం, మైండ్ ట్రీ 7.29 శాతం, కోఫోర్జ్ 7.53 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ 50 స్టాక్స్ 1.03 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.12 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.84 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.58 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.17 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.20 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.54 శాతం, నిఫ్టీ ఐటీ 3.36 శాతం, నిఫ్టీ మీడియా 0.73 శాతం, నిఫ్టీ మెటల్ 1.36 శాతం, నిఫ్టీ ఫార్మా 2.22 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.97 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.45 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.57 శాతం లాభపడ్డాయి.

టాప్ గెయినర్స్, లూజర్స్
మార్కెట్లు నేడు లాభపడగా, రిలయన్స్ స్టాక్ మాత్రం నష్టపోయింది. నేడు 0.24 శాతం మేర నష్టపోయి రూ.1935 వద్ద ముగిసింది.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో 5.49 శాతం, HCL టెక్ 4.98 శాతం, టెక్ మహీంద్రా 4.17 శాతం, ఇన్ఫోసిస్ 3.67 శాతం, గెయిల్ 3.31 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో కొటక్ మహీంద్రా 0.93 శాతం, బజాజ్ ఫైనాన్స్, 0.60 శాతం, HDFC 0.46 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 0.24 శాతం, హిండాల్కో 0.17 శాతం ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో హిండాల్కో, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications