సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్ భారీ లాభాలు: రూ.5.4 లక్షల కోట్ల సంపద జంప్
నిన్న భారీగా పతనమైన స్టాక్ మార్కెట్‌లు నేడు (మంగళవారం, ఫిబ్రవరి 15) అంతేస్థాయిలో ఉవ్వెత్తున ఎగిశాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ భయాలు కమ్ముకోవడంతో సెన్సెక్స్ నిన్న 1700 పాయింట్లకు పైగా, నిఫ్టీ 530 పాయింట్లకు పైగా పడిపోయాయి. దీంతో నిన్న ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.8 లక్షల కోట్లకు పైగా హరించుకు పోయింది. అయితే నేడు ఆ రెండు దేశాల మధ్య ఆందోళనలు తగ్గుముఖం పట్టినట్లుగా కనిపించడంతో మార్కెట్లు పైపైకి చేరాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలకు తోడు, నిన్నటి కనిష్టాల వద్ద నేడు కొనుగోళ్లకు మద్దతు లభించింది. సూచీలు నేడు ఉదయం నుండి అంతకంతకూ పైకెగిశాయి.

మార్కెట్ భారీ లాభాలకు కారణాలివే
మార్కెట్లు నిన్న భారీగా పతనమయ్యాయి. ఉదయం నుండి సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు అమెరికా మార్కెట్లు సోమవారం భారీ స్థాయిలో లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. ఐరోపా మార్కెట్లు, యూఎస్ ఫ్యూచర్స్ నేడు లాభాల్లో ఉన్నాయి. ఈ పరిణామాలు రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలకు తెరపడినట్లుగా భావించారు ఇన్వెస్టర్లు. దీనికి తోడు దౌత్య మార్గంలో వివాదాన్ని పరిష్కరించుకోవడానికి రష్యా-ఉక్రెయిన్ అంగీకరించినట్లుగా వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. నిన్నటి భారీ నష్టాల నేపథ్యంలో నేడు కనిష్టాల వద్ద కొనుగోళ్లు జరిపారు.

అన్ని రంగాలు లాభాల్లోనే..
నేడు అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి. ఆటో, రియాల్టీ, ఐటీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్, బ్యాంకు, పీఎస్‌యు బ్యాంకు స్టాక్స్ 2 శాతం నుండి 4 శాతం మేర లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2 శాతం మేర క్షీణించాయి. అత్యధికంగా బజాజ్ ఫైనాన్స్ 5 శాతానికి పైగా లాభపడింది.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్, ఐచర్ మోటార్స్, శ్రీ సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటో కార్ప్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో సిప్లా, ఓఎన్జీసీ ఉన్నాయి.
స్పెస్ జెట్ వరుసగా ఏడు సెషన్లలో నష్టపోయింది. మూడో త్రైమాసికంలో రూ.23 కోట్ల నెట్ ప్రాఫిట్ నమోదు చేయడంతో నేడు లాభాల్లోకి వచ్చింది

పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
స్టాక్ మార్కెట్ నేడు భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ.5.4 లక్షల కోట్లు పెరిగింది. గత ఏడాది కాలంలో ఇదే గరిష్టం. నిన్నటి మార్కెట్ పతనం గత పది నెలల్లో ఇదే పెద్దది. అదే సమయంలో నేటి లాభం గత ఏడాది కాలంలో ఇదే గరిష్టం. బీఎస్ఈ లిస్టెట్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.261.80 లక్షల కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications