Stock Market: రికార్డుల మోత మోగిస్తున్న సూచీలు.. ఏకంగా రూ.14 లక్షల కోట్లు.. వామ్మో..
Sensex Records: గడచిన రెండు వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు కొంత ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నప్పటికీ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీల పనితీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
2007 తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్ రికార్డు లాభాలను నమోదు చేసింది. కేవలం 11 ట్రేడింగ్ సెషన్లలో మార్కెట్లు ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో రూ.14 లక్షల కోట్లు మేర ఇన్వెస్టర్ల సంపద పెరుగుదలను నమోదు చేసింది. తగ్గుతున్న ద్రవ్యోల్బణంతో పాటు అంతర్జాతీయంగా సానుకూలంగా మారుతున్న పరిస్థితులు ర్యాలీకి దోహదపడుతున్నాయి. అలాగే వర్షాబావ పరిస్థితులు సైతం మెరుగుపడటం మార్కెట్లలో ఊరటను కలిగిస్తోంది.

ఇదే క్రమంలో ఆగస్టులో ఆటోమొబైల్ విక్రయాలు మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి. రానున్న క్యూ-2లో మెటల్స్, ఆటోమెుబైల్స్, ఇన్‌ఫ్రా, నిర్మాణ రంగాల్లోని కంపెనీలు మెరుగైన లాభాలను నమోదు చేస్తాయని తెలుస్తోంది. ఇదే క్రమంలో విదేశీ పెట్టుబడిదారులు మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకున్నప్పటికీ.. దేశీయ మార్కెట్లలో రికార్డు స్థాయిలో పెరిగిన మ్యూచువల్ ఫండ్ సిప్ పెట్టుబడి పెట్టడం మార్కెట్లను ఉత్సాహంగా ముందుకు కొనసాగిస్తోంది.
ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ సైతం ఈవారం ప్రారంభంలో కొత్త గరిష్ఠాలను తాకింది. ప్రస్తుతం నిఫ్టీ 20,200 స్థాయికి అతి సమీపంలో శుక్రవారం ట్రేడింగ్ ముగించింది. దాదాపు 52 సెషన్ల తర్వాత సెప్టెంబర్ 11న నిఫ్టీ బెంచ్ మార్క్ ఇండెక్స్ 20,000 మార్కును తాకింది. అయితే నిఫ్టీ మిడ్, స్మాల్ క్యాప్ రంగాల షేర్లు దిద్దుబాటుకు గురైనప్పటికీ సైతం మెరుగైన పనితీరును కనబరిచాయి. రానున్న కాలంలో ఈ రెండు సూచీలు మరింతగా కరెక్షన్‌కు గురవుతాయని ప్రశాంత్ ఖేమ్కా ఇప్పటికే అంచనా వేస్తున్నారు. అలాగే లాభాలను చూసి పెన్నీ స్టాక్స్ కోసం కొత్త ఇన్వెస్టర్లు టెంప్ట్ అవటం ఆందోళన కలిగిస్తోందని విజయ్ కేడియా అన్నారు.


Click it and Unblock the Notifications