దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం(ఫిబ్రవరి 07, 2022) భారీగా నష్టపోయాయి. బడ్జెట్‌కు ముందు, తర్వాత లాభపడిన సూచీలు, వరుసగా మూడు రోజుల పాటు మాత్రం నష్టాలను చవిచూశాయి. గతవారం చివరి రెండు సెషన్‌లలో స్వల్పంగా నష్టపోయినప్పటికీ, నేడు మాత్రం భారీగా పతనమయ్యాయి. దీంతో సెన్సెక్స్ మళ్లీ 58,000 దిగువకు, నిఫ్టీ 17,250 పాయింట్ల కిందకు వచ్చింది. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు, ఏ దశలోను కోలుకోలేదు. గంటగంటకీ మరింత క్షీణించాయి. ఉదయం దాదాపు 100 పాయింట్ల నష్టంతో ప్రారంభమై, అంతకంతకూ దిగజారి చివరకు 1000 పాయింట్లకు పైగా నష్టంతో ముగిసింది సెన్సెక్స్. ఇంట్రాడేలో ఓ సమయంలో 1300 పాయింట్లు పతనమైంది.

అందుకే మార్కెట్ పతనం
సెన్సెక్స్ స్టాక్స్‌లలో FII ఫేవరేట్ స్టాక్స్‌లో HDFC, HDFC బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్ వంటివి ఉన్నాయి. అయితే ఈ స్టాక్స్ 3 శాతం నుండి 3.5 శాతం మేర క్షీణించాయి. ఈ వారం నిఫ్టీ 17000 పాయింట్ల నుండి 16800 పాయింట్ల మధ్య ముగియవచ్చునని అంచనాలు ఉన్నాయి. అయితే FIIలు పెద్ద ఎత్తున వెనక్కి వెళ్లాయి.
దీనికి తోడు ముడి చమురు ధరలు పైపైకి చేరుకుంటూ, 100 డాలర్లను తాకే స్థాయిలో ఉండటం, అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు వేగంగా సాగుతుండటం, ఐటీ షేర్లలో దిద్దుబాటు, ఆర్బీఐ మానిటరీ పాలసీ, ప్రాఫిట్ బుకింగ్ వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి.

మూడ్రోజుల్లో రూ.7 లక్షల కోట్లు
మూడ్రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.7 లక్షల కోట్లు హరించుకుపోయింది. నేడు యూరోపియన్ స్టాక్ మార్కెట్లు కూడా మిశ్రమంగా ఉన్నాయి. టాప్ 100 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు రూ.2.64 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, HUL, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ వరుసగా ఉన్నాయి.

నేడు సెన్సెక్స్, నిఫ్టీ ఇలా
సెన్సెక్స్ నేడు 58,549.67 వద్ద ప్రారంభమై, 58,549.67 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,299.05 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,456.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,536.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,119.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 1,023.63 (1.75%) పాయింట్లు నష్టపోయి 57,621.19 పాయింట్ల వద్ద, నిఫ్టీ 302.70 (1.73%) పాయింట్లు క్షీణించి 17,213.60 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి 74.69 వద్ద ముగిసింది.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications