కరోనా దెబ్బ, 2008 తరహా ఆర్థిక సంక్షోభం: మార్కెట్ నష్టాలకు 4 కీలక కారణాలు
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (మార్చి 16) కుప్పకూలాయి. శుక్రవారం వచ్చిన లాభాలు మొత్తం ఈ రోజు ఆవిరయ్యాయి. దీంతో మార్కెట్లను కరోనా భయాలు వీడలేదని తేలిపోయింది. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 2,375.55 (6.97%) పాయింట్లు నష్టపోయి 31,727.93 వద్ద, నిఫ్టీ 650 పాయింట్లు నష్టపోయి 9,250 పాయింట్ల కంటే తక్కువగా ఉంది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్, ప్రపంచ మార్కెట్లను కరోనా వైరస్ ఆ స్థాయిలో నష్టపరుస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిస్తోంది. మృతుల సంఖ్య ఆరున్నర వేలకు చేరుకుంది. చైనాలో మృతుల సంఖ్య, కరోనా ప్రభావం తగ్గినప్పటికీ ఇతర దేశాల్లో పెరుగుతోంది. దీంతో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపై పడింది. ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. యెన్‌తో డాలర్ మారకం 2 శాతం నష్టపోయింది. ఆస్ట్రేలియా బెంచ్‌మార్క్ స్టాక్ 7 శాతం నష్టపోయింది. న్యూజిలాండ్ మార్కెట్లు 3 శాతం పడిపోగా, జపాన్ నిక్కీ ఫ్లాట్‌గా, సౌత్ కొరియా కోస్పీ నష్టాల్లో ఉంది.

అమెరికా ఫెడ్ రేట్లు
అమెరికాఫెడరల్ రిజర్వ్ బ్యాంకుతో పాటు అంతర్జాతీయ కేంద్ర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేటును దాదాపు జీరో సమీపానికి తీసుకు వచ్చింది. ఫెడ్ వడ్డీ రేటు తగ్గింపు అమెరికాలోని బ్యాంకులకు మద్దతుగా నిలుస్తాయని, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయని అంటున్నారు.

క్రూడాయిల్ ధరలు
క్రూడాయిల్ ధరలు సోమవారం కూడా నష్టాలు చవిచూశాయి. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో క్రూడాయిల్ ధరలు కేవలం ఏడు నెలల్లోనే 70 శాతం మేర పతనమయ్యాయి. కరోనా, ప్రైస్ ధరల కారణంగా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావం మార్కెట్లపై పడుతోంది. క్రూడ్ ధరలు బ్యారెల్ 30 డాలర్లకుచేరుకుంది.

FPIలు వెనక్కి
ఫారన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్స్ (FPI) పెద్ద ఎత్తున పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. మార్చి నెలలో 37,976 కోట్లు తీసేసుకున్నారు. కరోనా మహమ్మారికి సౌదీ అరేబియా - రష్యా ప్రైస్ వార్ తోడవడంతో FPIలు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. మార్చి 2వ తేదీ నుండి 13 తేదీ మధ్య ఓవర్సీస్ ఇన్వెస్టర్లు ఈక్వీటీల నుండి రూ.24,776 కోట్లు, డెబ్ట్ సెగ్మెంట్ నుండి రూ.13,199 కోట్లు వెనక్కి తీసుకున్నారు.


Click it and Unblock the Notifications