ఢిల్లీ: స్టాక్ మార్కెట్లు సోమవారం (మార్చి 8) స్వల్ప లాభాల్లో ముగిశాయి. ప్రభుత్వరంగ బ్యాంకు స్టాక్స్ మాత్రమే లాభపడ్డాయి. దాదాపు అన్నిరంగాలు నష్టపోయాయి. నేటి ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో నష్టాల్లోకి వెళ్లి, తిరిగి కోలుకొని స్వల్ప లాభాలతో ముగిశాయి. రోజంతా ఒడిదుడుకుల్లో కనిపించాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.73.21 వద్ద క్లోజ్ అయింది. అమెరికా ఉద్యోగ కల్పనపై సానుకూల సంకేతాలు నేపథ్యంలో ఆసియా మార్కెట్లు ఉదయం సానుకూలంగా ఉన్నాయి. మధ్యలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ, చివరకు మిశ్రమంగా ముగిశాయి.

భారీ లాభాల నుండి స్వల్ప లాభాల్లోకి
సెన్సెక్స్ 50,654.02 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,985.77 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,318.26 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నేడు సెన్సెక్స్ 650 పాయింట్ల మేర పైకి, కిందకు కదలాడింది. నిఫ్టీ 15,002.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,111.15 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,919.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 35.75 పాయింట్లు లేదా 0.07% లాభపడి 50,441.07 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18.10 పాయింట్లు లేదా 0.12% ఎగిసి 14,956.20 పాయింట్ల వద్ద ముగిసింది. 1698 షేర్లు లాభాల్లో, 1382 షేర్లు నష్టాల్లో ముగియగా, 208 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

టాప్ లూజర్స్, గెయినర్స్
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, రిలయన్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎప్‌సీ బ్యాంకు ఉన్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో UPL 6.49 శాతం, గెయిల్ 4.76 శాతం, లార్సన్ 3.53 శాతం, ONGC 2.87, ఎస్బీఐ లైఫ్ ఇన్సురా 2.25 శాతం ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో శ్రీసిమెంట్స్ 2.38 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.28 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 2.09 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకు 2.08 శాతం, బజాజ్ ఆటో 1.40 శాతం నష్టపోయాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 సూచీ 0.95 శాతం, మిడ్ క్యాప్ సూచీ 2.79 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 0.95 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.60 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.41 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.41 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.58 శాతం, నిఫ్టీ ఐటీ 1.57 శాతం, నిఫ్టీ మెటల్ 2.70 శాతం, నిఫ్టీ ఫార్మా 1.29 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.93 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.58 శాతం, నిఫ్టీ రియాల్టీ మాత్రం 1.42 శాతం నష్టపోయాయి. కేవలం నిఫ్టీ మీడియా 0.15 శాతం లాభపడింది.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications