దూసుకెళ్తున్న మార్కెట్: సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్
స్టాక్ మార్కెట్ సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ గతవారం 52,723 పాయింట్ల వద్ద ముగియగా, నేడు 53,500 సమీపంలో ఆరంభించింది. ఆ తర్వాత కాస్త నష్టాల్లోకి జారుకున్నప్పటికీ, వెంటనే కోలుకుని, రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఉదయం గం.9.40 సమయానికి సెన్సెక్స్ 730 పాయింట్ల లాభాల్లో ఉంది. ఆ తర్వాత కాస్త స్థిరంగా కనిపించింది. అంతకుముందు వారం నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, గతవారం మాత్రం లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ నేడు ఉదయం 53,469 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,283 పాయింట్ల వద్ద కనిష్టాన్ని, 53,509 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.9.40 లోపు దాదాపు 770 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 9.43 సమయానికి 690 పాయింట్ల లాభానికి పరిమితమైంది. నిఫ్టీ 212 పాయింట్లు ఎగిసి 15,912 పాయింట్ల వద్ద కదలాడింది.

శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి సానుకూలంగా ఉందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. నేడు ఐటీ స్టాక్స్ దూసుకుపోతున్నాయి. అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ జాబితాలో రిలయన్స్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, HDFC బ్యాంకు, టెక్ మహీంద్రా ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, JSW స్టీల్, ఇన్ఫోసిస్, లార్సన్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications