ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (జూన్ 21) భారీ నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, అమెరికా మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగియడంతో ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా ఉన్నాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్ పైన పడింది. ఆటో తదితర రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సూచీలు భారీ నష్టాల్లో ఉన్నాయి. మధ్యాహ్నం గం.11.15 సమయానికి సెన్సెక్స్ 249 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్ల మేర నష్టపోయింది. బీఎస్ఈ 30 సూచీలో ఎన్టీపీసీ, హెచ్‌యూఎల్, సన్ ఫార్మా మినహా మిగతా స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
సెన్సెక్స్ ఉదయం 51,887.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,197.42 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,740.19 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,525.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,626.30 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,505.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ మధ్యాహ్నం గం.11.20 సమయానికి 83.60 (0.53%) పాయింట్లు నష్టపోయి 15,601.40 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 261.63 (0.50%) పాయింట్లు నష్టపోయి 52,109.83 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 3.41 శాతం, ఎన్టీపీసీ 2.03 శాతం, HUL 1.01 శాతం, ఏషియన్ పేయింట్స్ 0.72 శాతం, HDFC లైఫ్ 0.63 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్ 4.52 శాతం, టాటా మోటార్స్ 2.57 శాతం, విప్రో 1.87 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.71 శాతం, హిండాల్కో 1.74 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, రిలయన్స్, టాటా మోటార్స్ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.52 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.26 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.25 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.77 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.58 శాతం, నిఫ్టీ ఐటీ 0.84 శాతం, నిఫ్టీ మెటల్ 0.59 శాతం, నిఫ్టీ ఫార్మా 0.07 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.50 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.63 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ 0.11 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.16 శాతం, నిఫ్టీ మీడియా 1.61 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.57 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications