ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం(డిసెంబర్ 30) స్వల్పనష్టాల్లో ఉన్నాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 38.72 పాయింట్లు (0.08%) లాభపడి 47,651.80 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11.10 పాయింట్లు(0.08%) లాభపడి 13,943.70 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్ళింది. ఓ సమయంలో 150 పాయింట్ల మేర నష్టపోయింది. అనంతరం ఉదయం గం.11.30 సమయానికి 27 పాయింట్ల లాభాల్లోకి, వచ్చి మళ్లీ నష్టాల్లోకి వెళ్లింది.
886 షేర్లు లాభాల్లో, 343 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 52 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి 73.36 వద్ద ప్రారంభమైంది. మంగళవారం 73.42 వద్ద క్లోజ్ అయింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్ళు పెరగడంతో డాలర్ వ్యాల్యూ పెరిగింది. నిన్నటి వరకు రూపాయి వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో UPL 3.50 శాతం, ఐచర్ మోటార్స్ 2.17 శాతం, టెక్ మహీంద్రా 1.45 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.44 శాతం, శ్రీసిమెంట్స్ 1.14 శాతం లాభపడ్డాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో HDFC 0.99 శాతం, SBI 0.88 శాతం, సిప్లా 0.85 శాతం, సన్ ఫార్మా 0.74 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 0.65 శాతం ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు ఉన్నాయి.
రిలయన్స్ స్టాక్ 0.048 శాతం లాభపడి రూ.1991 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా...
బ్యాంకింగ్, ఫార్మా స్టాక్స్ మార్కెట్లను కిందకు లాగాయి. నిఫ్టీ 50 స్టాక్స్ 0.02 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.07 శాతం నష్టపోయాయి.
నిఫ్టీ ఆటో 0.45 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.06 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.13 శాతం, నిఫ్టీ ఐటీ 0.36 శాతం, నిఫ్టీ మీడియా 0.06 శాతం, నిఫ్టీ మెటల్ 0.04 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 0.48 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.37 శాతం, నిఫ్టీ ఫార్మా 0.40 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.74 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.21 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.39 శాతం నష్టపోయాయి.

చమురుకు డిమాండ్
అంతర్జాతీయంగా చమురుకు డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో రికవరీ సంకేతాలు కనిపిస్తుండటంతో చమురుకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. అంతకుముందు రోజు వాల్ స్ట్రీట్ సూచీలు రికార్డు గరిష్టాన్ని తాకాయి. దీంతో నిన్న స్వల్ప నష్టాల్లో ముగిశాయి. నిన్న డౌజోన్స్ ఇండస్ట్రియల్ 68.30 పాయింట్లు లేదా 0.2 శాతం క్షీణించి 30,335.67 పాయింట్ల వద్ద, నాస్‌డాక్ 49.20 పాయింట్లు లేదా 0.4 శాతం క్షీణించి 12,850.22 పాయింట్లకు పడిపోయింది.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications