For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిన్నటిలాగే మార్కెట్లు.. భారీ లాభాల్లో ప్రారంభమై అంతలోనే!: క్రూడాయిల్ షేర్లు జంప్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్ ఆరంభంలోనే 500 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్లు ఎగిసింది. అయితే మధ్యాహ్నం గం.12.17 సమయానికి 146 పాయింట్లు (సోమవారంతో పోల్చితే) మాత్రమే పెరిగి 38,290 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 66 పాయింట్లు దిగజారి 11,199 వద్ద ట్రేడ్ అయింది. సోమవారం మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అయి ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లిపోయాయి. మంగళవారం కూడా భారీ లాభాలతో ప్రారంభమై మధ్యాహ్నానికి ఆ లాభాలు తగ్గుముఖం పట్టాయి.

అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధరలు: ఢిల్లీ, హైదరాబాద్‌లో ఎంతంటే?అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధరలు: ఢిల్లీ, హైదరాబాద్‌లో ఎంతంటే?

లాభాల్లో అన్ని రంగాల షేర్లు..

లాభాల్లో అన్ని రంగాల షేర్లు..

దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం నాటి ముగింపుతో పోలిస్తే మంగళవారం ఉదయం పాజిటివ్‌గా ఉంది. డాలరుతో రూపాయి మారకం 72.20 వద్ద కొనసాగింది. కొన్ని కంపెనీల షేర్లు పుంజుకోవడమే లాభాలకు కారణంగా తెలుస్తోంది. మధ్యాహ్నం గం.12.30 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో వేదాంత, హిండాల్కో, జీఎంటర్టైన్మెంట్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐటీసీ ఉన్నాయి.

1297 పాయింట్లు అప్ డౌన్

1297 పాయింట్లు అప్ డౌన్

సోమవారం మార్కెట్లు లాభాల్లో ప్రారంభమై చివరకు 153 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. ఓ సమయంలో 786 పాయింట్ల లాభాల్లో ఉన్న మార్కెట్లు ఏకంగా 511 పాయింట్ల నష్టాల్లోకి జారుకుంది. అంటే నిన్న సెన్సెక్స్ అకంగా 1297 పాయింట్ల అప్ డౌన్ చూసింది. చివరకు 153 పాయింట్ల నష్టంతో ముగిసింది.

క్రూడాయిల్ షేర్లు జంప్c

క్రూడాయిల్ షేర్లు జంప్c

ఈ ఏడాదిలో తొలిసారి ముడి చమురు ధరలు నాలుగు నుండి 5 శాతం పెరిగాయి. కరోనావైరస్ సమస్యలకు చెక్ పెట్టేవిధంగా ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు సహాయక ప్యాకేజీలను ప్రకటించే అంచనాల నేపథ్యంలో చమురు ధరలకు జోష్ వచ్చిందని భావిస్తున్నారు. కేంద్రబ్యాంకులు, ప్రభుత్వాలు తీసుకునే చర్యలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ నెలలో ఒపెక్, రష్యా తదితర దేశాలు చమురు ధరల్ని నిలబెట్టేందుకు ఉత్పత్తిలో కోతలను పెంచే వీలున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది కూడా మార్కెట్‌లలో జోష్ నింపింది.

English summary

నిన్నటిలాగే మార్కెట్లు.. భారీ లాభాల్లో ప్రారంభమై అంతలోనే!: క్రూడాయిల్ షేర్లు జంప్ | Sensex off day's high, up 100 points

The Indian rupee erased all its early gains and trading flat at 72.71 per dollar versus previous close 72.74.
Story first published: Tuesday, March 3, 2020, 12:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X