ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అయితే మధ్యాహ్నం సమయానికి స్వల్ప నష్టాల్లోకి వెళ్లాయి. పీఎస్‌యు బ్యాంకింగ్ స్టాక్స్ లాభపడగా, మెటల్స్ భారీగా నష్టపోయాయి. టెక్ షేర్ల అండతో అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై, తదనుగుణంగా దేశీయ మార్కెట్ పైన పడింది. దీంతో ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి.
ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లి, తిరిగి స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. లోన్ మారటోరియానికి సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలు ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ఫ్యూచర్ దాదాపు 50 పాయింట్లకు పైగా ట్రేడవుతోంది. వీటితో పాటు దేశీయంగా కీలక కంపెనీల షేర్లు రాణిస్తుండడం సూచీలకు దన్నుగా నిలుస్తోంది.

సెన్సెక్స్ జంప్
సెన్సెక్స్ ఉదయం 49,876.21 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,227.03 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,661.92 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిన్న 50,000 దిగువన 49,771 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు 50వేల మార్కును క్రాస్ చేసింది. అయితే కాసేపటికే ఈ మార్క్ దిగువకు వచ్చింది. మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ 134.59 (0.27%) పాయింట్లు లాభపడి 49,905.99 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
నిఫ్టీ 14,768.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,867.75 వద్ద గరిష్టాన్ని, 14,707.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1 సమయానికి నిఫ్టీ 30.70 (0.21%) పాయింట్ల లాభంతో 14,767.10 పాయింట్ల వద్ద ఉంది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ICICI బ్యాంకు, SBI, రిలయన్స్ ఉన్నాయి.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో శ్రీ సిమెంట్స్ 3.80 శాతం, టైటాన్ కంపెనీ 2.84 శాతం, అదానీ పోర్ట్స్ 2.37 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 1.89 శాతం, టాటా మోటార్స్ 1.90 శాతం లాభపడ్డాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో IOC 2.52 శాతం, హిండాల్కో 2.25 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.70 శాతం, ఓఎన్జీసీ 1.51 శాతం, ఐటీసీ 1.39 శాతం ఉన్నాయి.

రంగాలవారీగా..
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ 50 స్టాక్స్ 0.26 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.66 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.76 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.67 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.03 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.704 శాతం, నిఫ్టీ ఐటీ 0.61 శాతం, నిఫ్టీ ఫార్మా 0.20 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.36 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.61 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.71 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.04 శాతం, నిఫ్టీ మీడియా 0.64 శాతం, నిఫ్టీ మెటల్ 0.80 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications