Market Crash: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. వెంటాడి వేటాడిన బేర్స్.. ఏమైందంటే..
Stock Market: ఉదయం స్వల్ప లాభాలతో ఫ్లాట్ ఆరంభాన్ని నమోదు చేసిన మార్కెట్లు తమ ప్రయాణాన్ని ఒడిదొడుకుల్లో కొనసాగించాయి. అయితే కొద్దిసేపటికే బేర్స్ మార్కెట్లపై ఆధిపత్యం చెలాయించటంతో సూచీలు నష్టాల బాట పట్టాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 671 పాయింట్లను కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 198 పాయింట్లను నష్టపోవాల్సి వచ్చింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 709 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 502 పాయింట్లను నష్టపోయాయి. క్యూ3 ఫలితాలు దగ్గరపడుతున్న వేళ సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు నేడు 1 శాతం మేర కరెక్షన్ నమోదు చేశాయి.

ద్రవ్యోల్బణం డేటా, బ్యాంక్ రుణాల వృద్ధి, డిపాజిట్ వృద్ధి మార్కెట్ కదలికను రూపొందించే కొన్ని ట్రిగ్గర్లుగా ఉన్నాయి. అంతే కాకుండా టెక్ మేజర్ ఇన్ఫోసిస్ దాని త్రైమాసిక ఫలితాలను ఈవారం విడుదల చేయనున్న వేళ ఆదాయాల సీజన్ జనవరి 11 నుంచి కిక్‌స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత ఇతర దిగ్గజాలైన టీసీఎస్, హెచ్‌సీఎల్, విప్రోలు తమ ఆర్థిక ఫలితాలను వెలువరించనున్నాయి. రంగాలవారీగా ప్రభుత్వ బ్యాంకులు, ఎఫ్ఎమ్సీజీ, ఐటీ, ఫార్మా సూచీలు 2 శాతం వరకు నేడు క్షీణించాయి. ఇదే క్రమంలో మీడియా, రియల్టీ రంగాలు లాభాలను నమోదు చేశాయి.
NSEలో అదానీపోర్ట్స్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, హీరో మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముందుకు సాగించాయి.
ఇదే క్రమంలో యూపీఎల్, ఎస్బీఐ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, దివీస్ ల్యాబ్, టాటా కన్జూమర్, ఎల్ టిఐఎమ్, ఐటీసీ, బ్రిటానియా, హిందాల్కొ, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనీలివర్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, సిప్లా, ఇండస్ఇండ్, నెస్లే సహా మరిన్ని కంపెనీల షేర్లు టాప్ లూజర్లుగా తమ ప్రయాన్ని నేడు ముగించాయి.


Click it and Unblock the Notifications