Stock Market: స్వల్ప లాభాల్లో సూచీలు.. అంతర్జాతీయ బలహీనతల మధ్య..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి ధోరణిలోనే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలతో ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.30 గంటల సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 55 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 20 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 17 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 146 పాయింట్ల మేర లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే సూచీలు ఇంట్రాడేలో నష్టాల్లోకి జారుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

NSEలో బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్, రిలయన్స్, నెస్లే, పవర్ గ్రిడ్, బీపీసీఎల్, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, ఎల్ టి, అల్ట్రాటెక్ సిమెంట్స్, కోటక్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, యూపీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
ఇదే క్రమంలో ఐషర్ మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, హిందాల్కొ, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, హీరో మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ, టీసీఎస్, గ్రాసిమ్, ఇన్ఫోసిస్, టాటా కన్జూమర్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications