Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. స్టీల్ స్టాక్స్ నేల చూపులు..
Market Opening: మార్చి నెలలో కొత్త వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూల ధోరణితో ప్రారంభించాయి. కీలక సూచీలు లాభాల్లో కొనసాగుతున్నప్పటికీ.. టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు క్షీణించాయి.
ఉదయం 9.28 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 80 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. ఇదే క్రమంలో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 20 పాయింట్ల మేర లాభంతో కొనసాగుతోంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 107 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 54 పాయింట్ల నష్టంలో ట్రేడవుతోంది.

ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, ఎయిర్ టెల్, అదానీ పోర్ట్స్, యూపీఎల్, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, రిలయన్స్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, సిప్లా, బీపీసీఎల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, టాటా కన్జూమర్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, ఎల్ టి, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టిఐఎమ్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనీలివర్, విప్రో, గ్రాసిమ్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ప్రస్తుతం కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications