Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. రిలయన్స్ డీమెర్జర్..
Stock Market: నిన్న సూపర్ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఒడిదొడుకుల్లో ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సూచనలు ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఉదయం 9.26 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 80 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 20 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 35 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 67 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అయితే సమయం గడిచేకొద్ది ప్రధాన సూచీల నష్టాల్లు క్రమంగా తగ్గుతున్నాయి.

ప్రధానంగా అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిసినప్పటికీ.. ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఈ రోజు ప్రధానంగా మార్కెట్లలో జియో ఫైనాన్సియల్స్ లాంట్ కీలకంగా మారనుంది. అనేక మంది ఇన్వెస్టర్లు దీనికోసం గత కొంత కాలంగా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్, బీపీసీఎల్, దివీస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కొ, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, గ్రాసిమ్, భారతీ ఎయిర్ టెల్, మారుతీ, కోల్ ఇండియా, కోటక్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, సిప్లా, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, నెస్లే, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టి, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనీలివర్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, ఎల్ టిఐఎమ్, బ్రిటానియా, బజాజ్ ఆటో, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications