Stock Market: ఒడిదొడుకుల్లోనూ లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్.. ఆవరించిన భయాలు..
Market Opening: నిన్న భారీ నష్టాలతో ముగిసిన తర్వాత నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. ఉదయం ప్రారంభం నుంచే ఓలటాలిటీ ఉన్నప్పటికీ.. లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.55 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 258 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 145 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 86 పాయింట్ల మేర నష్టంతో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో డిస్నీ-వయాకామ్ 18 డీల్ కారణంగా రిలయన్స్ షేర్లు లాభపడి టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో మారుతీ, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, ఎస్బీఐ, విప్రో, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా కన్జూమర్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, నెస్లే, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఆటో, యూపీఎల్, బీపీసీఎల్, అపోలో హాస్పిటల్స్, సిప్లా, దివీస్ ల్యాబ్, హిందుస్థాన్ యూనీలివర్, పవర్ గ్రిడ్, ఎల్ టిఐఎమ్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications