Stock Market: లాభాల్లో ప్రారంభమైన Sensex, Nifty.. అమెరికా ఎఫెక్టేనా..!
Stock Market: ఐటీ కంపెనీల మెుదటి త్రైమాసిక ఫలితాల భయాల నేపథ్యంలో నిన్న దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అయితే నేడు రెట్టింపు ఉత్సాహంతో తిరిగి లాభాల్లో సూచీలు ట్రేడింగ్ ప్రారంభించాయి.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 314 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 90 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 247 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 117 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ప్రధానంగా ద్రవ్యోల్బణం డేటా విడుదలతో అమెరికా మార్కెట్లు లాభాల్లో ఆశాజనకంగా ముగియటం ఆసియా మార్కెట్ల ర్యాలీకి కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో, హిందాల్కొ, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్, హీరో మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ, రిలయన్స్, కోటక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ ఇంట్రాడేలో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే సమయంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్, నెస్లే, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications