Stock Market: భారీ లాభాల్లో విహరిస్తున్న సెన్సెక్స్-నిఫ్టీ.. అంతా బుల్స్ హవాతోనే..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ఆకాశంలో విహరిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లలో విదేశీ మదుపరుల హవా కారణంగా సెన్సెక్స్-నిఫ్టీ భారీ లాభాలను చూస్తున్నాయి.
ఉదయం 10.13 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 595 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 184 పాయింట్ల లాభంలో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 370 పాయింట్ల లాభంలో, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 33 పాయింట్ల మేర లాభంతో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

ఎన్ఎస్ఈలో బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, హీరో మోటార్స్, దివీస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ,ఎస్బీఐ లైఫ్, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, ఎల్ టి, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా కన్జూమర్, బీపీసీఎల్, విప్రో కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బ్రిటానియా, టెక్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, హిందాల్కొ, మారుతీ, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications