Stock Market: బుల్స్ ర్యాలీకి నో బ్రేక్.. రివ్వున దూసుకుపోతున్న మార్కెట్ సూచీలు..
Stock Market: కొత్త నెలను దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. మార్కెట్ ప్రధాన సూచీల పరుగులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఆటో, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ షేర్లు ఫోకస్‌లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 310 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 84 పాయింట్ల మేర లాభంలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 259 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 179 పాయింట్ల మేర లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, ఎస్బీఐ, హిందాల్కొ, విప్రో, టాటా స్టీల్, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఎల్ టి, అపోలో హాస్పిటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్ గ్రిడ్, హీరో మోటార్స్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, మారుతీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications