Markets High: కొత్త గరిష్ఠాలకు సెన్సెక్స్-నిఫ్టీ.. అంతా అమెరికా చలవే..!

Stock Markets: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తాజాగా తన వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు ప్రకటించటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త గరిష్ఠాలను తాకాయి. దీంతో వరుసగా ఏడోసారి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు పావెల్.

ఈ వార్తలు గ్లోబల్ మార్కెట్లతో పాటు ఇండియాలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అదనంగా సానుకూలతను కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో ఐటీ, రియల్టీ రంగాలకు చెందిన కంపెనీలు భారీగా లాభపడ్డాయి. దీంతో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ ఇంట్రాడేలో 370 పాయింట్లు లాభపడి కొత్త జీవితకాల గరిష్ఠం 76,976ని చేరుకోగా.. మరో కీలక సూచీ Nifty 117 పాయింట్లు పెరిగి 23,440 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఇదే దారిలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు సైతం కొనసాగుతున్నాయి. అయితే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Sensex Nifty trading at all time high amid US Fed keeps interest rates unchanged

ఎన్ఎస్ఈలో ఉదయం దివీస్ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ టిఐఎమ్, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, హిందాల్కొ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బీపీసీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టి, టైటాన్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ కార్ప్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ముందుకు సాగుతున్నాయి.

ఇదే క్రమంలో హిందుస్థాన్ యూనీలివర్, టాటా కన్జూమర్, ఐషర్ మోటార్స్, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, మారుతీ, గ్రాసిమ్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, సిప్లా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+