Market Opening: మెగా ర్యాలీని కొనసాగిస్తున్న సెన్సెక్స్-నిఫ్టీ..!
Opening Bell: నిన్న ఒడిదొడుకులతో స్వల్ప నష్టాలతో ముగిసిన బెంచ్ మార్క్ సూచీలు నేడు తిరిగి పుంజుకున్నాయి. ఆరంభంలోనే మెగా ర్యాలీకి బాటలు వేశాయి.
ఉదయం 9.26 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 237 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 69 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 36 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 176 పాయింట్ల లాభంలో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం వేదాంత కంపెనీ షేర్లు భారీగా లాభపడి ట్రెండింగ్ లో ఉన్నాయి.

ఎన్ఎస్ఈలో ఎయిర్ టెల్, బీపీసీఎల్, హిందాల్కొ, టాటా స్టీల్, రిలయన్స్, ఓఎన్జీసీ, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ, అదానీ ఎంటర్ ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో దివీస్ ల్యాబ్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జూమర్, టీసీఎస్, ఎల్ టి, ఎల్ టిఐఎమ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications