సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ రికార్డ్‌స్థాయికి: ధరల పెరుగుదలతో మహీంద్రా స్టాక్స్ జంప్
ముంబై: నిన్న భారీ నష్టాలనుండి కోలుకొని, అతి స్వల్పలాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. నిన్న చివరి గంటలో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడటంతో నష్టాల నుండి బయటపడింది. నేడు ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 288.89 పాయింట్లు(0.62%) లాభపడి 46552.06 పాయింట్ల వద్ద, నిఫ్టీ 83.50 పాయింట్లు (0.62%) లాభపడి 13651.40 వద్ద ప్రారంభమైంది.
1094 షేర్లు లాభాల్లో, 250 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 48 షేర్లలో ఎలాంటి మార్పులేదు. మధ్యాహ్నం గం.12 సమయానికి సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడి 46,563 పాయింట్ల వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు ఎగిసి 13,653 పాయింట్ల వద్ద ఉంది. డాలర్ మారకంతో రూపాయి 17 పైసలు లాభపడి 73.47 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్‌లో 73.64 వద్ద క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి ప్రారంభ సెషన్లో PSU బ్యాంకు మినహా మిగతా అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. ఆటో, మెటల్ రంగాలు భారీగా ఎగిశాయి.
మధ్యాహ్నం గం.12 సమయానికి నేటి టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 2.62 శాతం, యూపీఎల్ 2.07 శాతం, దివిస్ ల్యాబ్స్ 2.04 శాతం, ఓఎన్జీసీ 1.99 శాతం, టాటా మోటార్స్ 1.96 శాతం ఉన్నాయి.
నేటి లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్ 0.78 శాతం, టెక్ మహీంద్రా 0.76 శాతం, గెయిల్ 0.68 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.45 శాతం, HDFC లైఫ్ 0.38 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి.

మహీంద్రా స్టాక్స్ జంప్
జనవరి నుండి తమ వాహనాల విక్రయాలు పెంచుతున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. దీంతో ఈ కంపెనీ స్టాక్స్ నేడు 4 శాతం లాభపడ్డాయి. మధ్యాహ్నం సమయానికి 2.50 శాతం మేర లాభాల్లో ఉంది. పాసింజర్, కమర్షియల్ వెహికిల్స్ ధరలు పెంచుతున్నట్లు మహీంద్రా నిన్న ప్రకటించింది.
రిలయన్స్ స్టాక్ నేడు ప్రారంభ సెషన్లో లాభపడినప్పటికీ, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. నిన్న రూ.1974.35 వద్ద క్లోజ్ అయినప్పటికీ, నేడు ప్రారంభంలో రూ.1995 వరకు దూసుకెళ్లింది. ఆ తర్వాత నిన్నటి కంటే కిందకు పడిపోయి రూ.1973 వద్ద ఉంది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 సూచీ 0.54 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1.16 శాతం లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఆటో 1.10 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.35 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.55 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.61 శాతం, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 0.91 శాతం, నిఫ్టీ ఐటీ 0.46 శాతం, నిఫ్టీ మీడియా 0.23 శాతం, నిఫ్టీ మెటల్ 1.35 శాతం, నిఫ్టీ ఫార్మా 1.01 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు మాత్రం 0.34 శాతం మేర నష్టపోయింది.


Click it and Unblock the Notifications