ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఏప్రిల్ 9) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నష్టాలతో ప్రారంభమై ఆ తర్వాత లాభాల్లో కనిపించినప్పటికీ, తిరిగి మధ్యాహ్నానికి నష్టాల్లో కి వెళ్ళింది. అయితే స్వల్ప లాభనష్టాలతో ఊగిసలాటలో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం టెక్ షేర్ల అండతో లాభాల్లో ముగిశాయి. గతవారంలో నిరుద్యోగుల నమోదు పెరగడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. దేశంలో కరోనా కేసుల పెరుగుతుండటం, కట్టడి కోసం ప్రభుత్వాల ఆంక్షలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఎక్కడికి అక్కడా ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు, లాక్ డౌన్‌లు తప్పనిసరి అని ప్రధాని మోడీ చెప్పారు. దీంతో ఎకానమీపై కొంత ప్రభావం ఉంటుంది. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ లేదని ప్రకటించడం ఊరట కలిగించే అంశం. నేడు మార్కెట్లకు ఈ వారంలో చివరి రోజు కావడంతో ప్రాఫిట్ బుకింగ్‌కు అవకాశం ఉంది.

అందుకే ఊగిసలాటలో మార్కెట్
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం, లాక్ డౌన్ లేదని ప్రకటించడం, అదే సమయంలో మినీ లాక్ డౌన్‌లు ఉంటాయనే సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పీఎస్‌యూ బ్యాంకు, ఫార్మా స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది. మెటల్ స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది.
సెన్సెక్స్ నేడు ఉదయం 49,743.39 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,906.91 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,499.99 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10 గంటల సమయంలో 140 పాయింట్ల మేర లాభపడినప్పటికీ మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం గం.11.50 సమయానికి సెన్సెక్స్ 60 (0.12%) పాయింట్లు నష్టపోయి 49,685 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
నిఫ్టీ 14,882.65 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,918.45 వద్ద గరిష్టాన్ని, 14,806.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.50 సమయానికి నిఫ్టీ 8.60 (0.058%) పాయింట్లు క్షీణించి 14,869 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో సన్ ఫార్మా 3.59 శాతం, సిప్లా 2.95 శాతం, టాటా మోటార్స్ 2.85 శాతం, హెచ్‌యూఎల్ 2.70 శాతం, టైటాన్ కంపెనీ 2.11 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 2.04 శాతం, యూపీఎల్ 1.88 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 1.75 శాతం, ఎన్టీపీసీ 1.67 శాతం, టాటా స్టీల్ 1.64 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో JSW స్టీల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, HDFC బ్యాంకు, SBI ఉన్నాయి.

ఈ రంగాలు జంప్
బ్యాంకింగ్, ఆర్థిక, ఇంధన, టెలికాం రంగ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. FMCG, మెటల్, హెల్త్ కేర్, ఐటీ రంగ సూచీలు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ 50లో HUL, టాటా మోటార్స్ షేర్లు దూసుకెళ్తున్నాయి. డాలర్ మారకంతో రూపాయి విలువ రూ.74.62 వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications