Stock Market: వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు తమ ప్రయాణాన్ని లాభాల్లో ప్రారంభించాయి. అయితే నేడు మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.30 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 53 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 17 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 39 పాయింట్ల లాభంలో ఉండగా.. నిన్న స్వల్ప నష్టాల మధ్య ట్రేడింగ్ ముగించిన నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ నేడు 121 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

మార్చి కనిష్ఠాల నుంచి నిఫ్టీ సూచీ ప్రస్తుతం 15 శాతం వరకు లాభపడింది. అయితే దీనిని బుల్ మార్కెట్‌గా వర్ణించడం కష్టమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ విజయకుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న వాల్యుయేషన్ స్థిరమైన ర్యాలీకి అనుమతించదని అభిప్రాయపడ్డారు. అలాగే ఆర్థిక పరిస్థితులు సైతం ఇంతకంటే మార్కెట్లు ముందుకు సాగేందుకు సహకరించదని పేర్కొన్నారు. స్థిరమైన బుల్‌రన్ కొనసాగేందుకు తక్కువ వాల్యుయేషన్‌లు, స్థిరమైన వృద్ధి, ఆదాయ అవకాశాలను మెరుగుపరచడం అవసరమన్నారు.
ఎన్ఎస్ఈలో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటార్స్, ఓఎన్జీసీ, దివీస్ ల్యాబ్స్, మారుతీ, ఎల్ టి, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే, గ్రాసిమ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అపోలో హాస్పిటల్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా, హిందాల్కొ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టైటాన్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications