Stock Market: అనిశ్చితిలోనూ ఆగని మార్కెట్లు.. మిశ్రమ సూచనల మధ్య ట్రేడింగ్..
Stock Market: గతవారం నష్టాల్లో ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త వారం ఫ్లాట్ ప్రారంభంతో మెుదలు పెట్టాయి. మెరుగైన ప్రారంభంతో ఓపెన్ అయినప్పటికీ.. క్షణాల్లోనే సూచీలు దిగజారటం ప్రారంభించాయి.
ఉదయం 9.20 గంటల సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 5 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ కేవలం 2 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 92 పాయింట్లు లాభంలో ఉండగా.., నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 22 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. ఇవి స్వల్ప నష్టాల్లోకి కూడా జారుకునే అవకాశం కనిపిస్తోంది.

NSEలో టాటా కన్జూమర్, సిప్లా, హిందుస్థాన్ యూనీలివర్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యూపీఎల్, హీరో మోటార్స్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టైటాన్, టీసీఎస్, ఐటీసీ, బ్రిటానియా, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, ఐషర్ మోటార్స్, ఓఎన్జీసీ, దివీస్ ల్యాబ్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ, ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్, బీపీసీఎల్, కోటక్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications