Market Closing: కొత్త ఆర్థిక సంవత్సరాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు శుభప్రదంగా ప్రారంభించాయి. నేడు బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్ నిఫ్టీ పనితీరు ఇన్వెస్టర్లలో ధైర్యాన్ని నింపింది.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయంలో సెన్సెక్స్ 363 పాయింట్లు, నిఫ్టీ 135 పాయింట్ల మేర పెరిగి తమ లాభాలను నిలబెట్టుకున్నాయి. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 454 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 836 పాయింట్ల మేర లాభపడటం ఇన్వెస్టర్ల సంతోషానికి అవదులు లేకుండా చేసింది. ఇదే సమయంలో నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్ రంగాల్లోని కంపెనీల షేర్లు భారీగా లాభపడటంతో సూచీలు అధిక లాభాలను చూశాయి.

ఎన్ఎస్ఈలో మార్కెట్ల క్లోజింగ్ సమయంలో జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, దివీస్ ల్యాబ్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్ టి, ఎన్టీపీసీ, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందాల్కొ, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, హిందుస్థాన్ యూనీలివర్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
ఇదే క్రమంలో ఐషర్ మోటార్స్, టైటాన్, నెస్లే, ఎల్ టిఐఎమ్, టాటా కన్జూమర్, బజాజ్ ఆటో, ఎయిర్ టెల్, హీరో మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, బ్రిటానియా, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐటీసీ, ఇన్ఫోసిస్, మారుతీ, రిలయన్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications