సరికొత్త గరిష్టాలకు మార్కెట్లు, సెన్సెక్స్ 59,000 పాయింట్లు క్రాస్
స్టాక్ మార్కెట్లు గురువారం (సెప్టెంబర్ 16) భారీ లాభాల్లో ముగిశాయి. ఆటో, వాహన రంగాలకు కేంద్ర కేబినెట్ భారీ ప్యాకేజీ, ఊరట ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన సూచీలు, గురువారం నాటి ట్రేడింగ్‌లోను అదే జోరు కొనసాగించి మరోసారి సరికొత్త గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ ఏకంగా 59,000 పాయింట్లు క్రాస్ చేసి, 60,000 పాయింట్ల దిశగా కనిపిస్తోంది. నిఫ్టీ 17,600 పాయింట్లకు పైన ముగిసింది. సెన్సెక్స్ ఈ నెల 3వ తేదీన మొదటిసారి 58,000 మార్కును దాటింది. రెండు వారాల్లో ఇప్పుడు 59,000ను దాటింది. నేడు ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లు రాణించడంతో సూచీలు వరుసగా మూడు రోజులు లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ నేడు 58,881.04 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,204.29 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,700.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,539.20 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,644.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,510.45 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 417.96 (0.71%) పాయింట్లు లాభపడి 59,141.16 పాయింట్ల వద్ద, నిఫ్టీ 110.05 (0.63%) పాయింట్లు ఎగిసి 17,629.50 పాయింట్ల వద్ద ముగిసింది.

ప్రధానంగా నిఫ్టీ పీసీయూ బ్యాంక్ సూచీ 5.43 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంక్ సూచీ 2.67 శాతం మేర లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ 2.22 శాతం లాభాన్ని నమోదు చేసింది. బీఎస్ఈలో దాదాపు 400 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్‌ను తాకగా, 280 స్టాక్స్ 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. డాలరు మారకంతో రూపాయి వ్యాల్యూ 73.52గా నమోదయింది. నిఫ్టీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ లిమిటెడ్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
భారత్ పెట్రోలియం, గ్రాసిం ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ, టాటా స్టీల్, శ్రీ సిమెంట్స్ షేర్లు నష్టపోయాయి. టెలికం టారిఫ్ ఊరట నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా స్టాక్ ధర 2 శాతం లాభపడింది. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంకు, వొడాఫోన్ ఐడియా, ఎస్బీఐ ఉన్నాయి.


Click it and Unblock the Notifications