Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు మంచి ఆరంభంతో మార్కెట్లో ప్రయాణాన్ని మెుదలు పెట్టాయి.
ఉదయం 9.22 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 312 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 68 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 63 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 27 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

ప్రధానంగా అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగియటం ఊరటను కలిగిస్తోంది. బ్యాంకింగ్ రంగం షేర్లు సైతం పుంజుకోవటం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతోంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో రోజు మార్కెట్లు రికార్డుల మోతమోగించే దారిలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
NSEలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హీరో మోటార్స్, టైటాన్, టీసీఎస్, ఎల్ టి, బజాజ్ ఆటో, విప్రో, యూపీఎల్, నెస్లే, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, ఓఎన్జీసీ, రిలయన్స్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, దివీస్ ల్యాబ్, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందుస్థాన్ యూనీలివర్, ఐటీసీ, హిందాల్కొ, బ్రిటానియా, అల్ట్రాటెక్ సిమెంట్స్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications