ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (ఫిబ్రవరి 17, బుధవారం) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు ఓ సమయంలో 4 శాతం మేర లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్, ఐటీ, ఫార్మా స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్స్ భారీగా లాభపడ్డాయి.
ఇందులో కొన్ని స్టాక్స్ 20 శాతం మేర ఎగిశాయి. ఈ బ్యాంకులు ప్రయివేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయనే వార్తల నేపథ్యంలో లాభపడ్డాయి. ప్రయివేటీకరించే బ్యాంకులకు సంబంధించి కేంద్రం షార్ట్ లిస్ట్ చేసిన విషయం తెలిసిందే. అమ్మకాల ఒత్తిడితో సూచీలు నష్టపోయాయి.

భారీ నష్టం నుండి స్వల్ప నష్టాల్లోకి..
సెన్సెక్స్ నేడు 51,996.94 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,078.15 వద్ద గరిష్టాన్ని, 51,681.48 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,279.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,289.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,201.25 వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం ఓ సమయంలో దాదాపు 400 పాయింట్ల మేర నష్టపోయింది. ఆ తర్వాత మధ్యాహ్నానికి కోలుకుంది. మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టపోయి 51,995 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 15,288 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

నేటి టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 3.61 శాతం, హీరో మోటోకార్ప్ 3.04 శాతం, SBI 2.67 శాతం, గెయిల్ 2.10 శాతం, HDFC లైఫ్ 2.02 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బీపీసీఎల్ 2.82 శాతం, నెస్ట్లే 2.57 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.83 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 1.80 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.74 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, రిలయన్స్, టాటా మోటార్స్ ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు 0.51 శాతం లాభపడి రూ.2070 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.24 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.49 శాతం లాభపడ్డాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.31 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.25 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.34 శాతం, నిఫ్టీ మీడియా 1.79 శాతం, నిఫ్టీ మెటల్ 0.21 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 5.50 శాతం, లాభపడ్డాయి.నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.42 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.37 శాతం, నిఫ్టీ ఐటీ 0.88 శాతం, నిఫ్టీ ఫార్మా 0.96 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.36 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.12 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications