For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సెక్స్ రికార్డులు, ఒక్కరోజులో రూ.8 లక్షల కోట్లు లాభపడ్డారు

|

స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఏప్రిల్ 7) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 30వేల పాయింట్లు క్రాస్ చేసింది. నిఫ్టీ 9,000 పాయింట్ల సమీపానికి వచ్చింది.
ఇంట్రాడేలో ఒకానొక దశలో 2,566.7 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 30,157 టచ్ చేసి, చివరకు 8.97 శాతం లేదా 2,476.26 పాయింట్ల లాభంతో 30,067.21 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ రికార్డ్, నిఫ్టీ దూకుడు: 2009 తర్వాత బిగ్గెస్ట్ సింగిల్ డే పెరుగుదలసెన్సెక్స్ రికార్డ్, నిఫ్టీ దూకుడు: 2009 తర్వాత బిగ్గెస్ట్ సింగిల్ డే పెరుగుదల

నిఫ్టీ 708.40 పాయింట్లు లేదా 8.76 శాతం ఎగిసి 8,792.20 వద్ద స్థిరపడింది. 2009 మే తర్వాత ఇదే అత్యంత పెరుగుదల. పాయింట్ల పరంగా చూస్తే సెన్సెక్స్ 2,476 పాయింట్లు సింగిల్ డే రికార్డ్. నేటి రికార్డ్ సూచీలతో ఇన్వెస్టర్లు కూడా భారీగానే లాభపడ్డారు.

Sensex, Nifty record: investors get richer by Rs 8L crore

నేడు స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడంతో ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఇన్వెస్టర్ల ఆస్తులు ఏకంగా రూ.7.86 లక్షల కోట్లు పెరిగాయి. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్వ్యాల్యూ రూ.116 లక్షల కోట్లకు పెరిగింది. పాయింట్ల లెక్కన సెన్సెక్స్‌కు అతిపెద్ద సింగిల్ డే రికార్డ్. నిప్టీ 2009 మే తర్వాత తొలిసారి 9 శాతం ఎగిసింది.

ఎన్ఎస్ఈలో అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ముగిశాయి. ప్రయివేటు బ్యాంకులు, ఫార్మా రంగాల షేర్లు భారీగా పెరిగాయి. నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు సూచీలు భారీగా 11 శాతం వరకు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకులు 2.09 శాతం లాభపడ్డాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్లు 15.34 శాతం మేర పెరిగి రూ.701 వద్ద ముగిసింది. నాలుగో క్వార్టర్‌లోను ఇది 100 శాతం వృద్ధి రేటు నమోదు చేయడంతో షేర్ల దూకుడు పెరిగింది.

English summary

సెన్సెక్స్ రికార్డులు, ఒక్కరోజులో రూ.8 లక్షల కోట్లు లాభపడ్డారు | Sensex, Nifty record: investors get richer by Rs 8L crore

Investors got richer by Rs 7.86 lakh crore in Tuesday’s rally as the total market-cap of BSE-listed firms rose to Rs 116 lakh crore.
Story first published: Tuesday, April 7, 2020, 20:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X