Stock Market: సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డులు.. ముంచిన ఐటీ స్టాక్..!
Closing Bell: ఉదయం ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన మార్కెట్లు చివరికి కీలక సూచీల లాభాలతో పాజిటివ్ ముగింపును నమోదు చేశాయి. ప్రధానంగా ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉండటం భారత మార్కెట్లను ప్రభావితం చేసింది.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 122 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 34 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 3 పాయింట్లు లాభంతో ముగియగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 173 పాయింట్ల నష్టంతో తమ ప్రయాణాన్ని ముగించింది. అయితే నేడు మార్కెట్లో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీ సరికొత్త రికార్డులను తాకాయి. ఇదే క్రమంలో ఎఫ్ఎమ్సీజీ స్టాక్స్ గెయిన్ కావటం నేటి లాభాలకు సపోర్ట్ చేసింది.

ఎన్ఎస్ఈలో కోల్ ఇండియా, నెస్లే, ఎన్టీపీసీ, సిప్లా, టాటా కన్జూమర్, రిలయన్స్, ఎస్బీఐ, ఐటీసీ, హిందుస్థాన్ యూనీలివర్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బీపీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, దివీస్ ల్యాబ్, కోటక్ బ్యాంక్, ఎల్ టి, ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో అదానీ పోర్ట్స్, విప్రో, అదానీ ఎంటర్ ప్రైజెస్, టీసీఎస్, యూపీఎల్, హీరో మోటార్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications