Record Highs: కొత్త రికార్డులు సృష్టించిన నిఫ్టీ, సెన్సెక్స్ సూచీ.. ఆగని మార్కెట్ పరుగులు..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి లాభాల పరంపరను కొనసాగిస్తున్నాయి. ప్రీ ఓపెన్ సెషన్ నుంచే దూకుడు మెుదలయ్యింది.
ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 241 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 73 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 101 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 134 పాయింట్ల లాభాల్లో కొనసాగుతున్నాయి.

గతవారం కొత్త జీవితకాల గరిష్ఠాలను సెన్సెక్స్ సూచీ నెలకొల్పగా.. నిఫ్టీ నేడు అదే దారిలో కొనసాగింది. నిఫ్టీ సూచీ నేడు 18900 స్థాయిని తాకింది. ఇదే సమయంలో నేనేమి తక్కువ కాదన్నట్లు సెన్సెక్స్ గతవారం అందుకున్న 63,588.31 స్థాయిని కేవలం ఏడు రోజుల్లోనే అధిగమించింది. ఈ క్రమంలో తాజాగా 63716 స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత కొనసాగుతున్నప్పటికీ భారత మార్కెట్లలో బుల్ జోరు అస్సలు తగ్గటం లేదు.
NSEలో అదానీ ఎంటర్ ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, టైటాన్, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, ఎల్ టి, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, రిలయన్స్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్రిటానియా కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ లైఫ్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, సిప్లా, ఎన్టీపీసీ, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications