భారీ లాభాలు ఆవిరి, 30 నెలల తర్వాత వరుస లాభాలు: 2008 తర్వాత ఆ స్టాక్ భారీ పతనం
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఫార్మా షేర్ల అండతో వరుసగా ఎనిమిదో రోజు లాభాలను చూశాయి. అయితే నేటి ఆరోభ లాభాలను నిలుపుకోలేదు. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఓ సమయంలో 400 పాయింట్ల మేర లాభపడింది. చివరకు ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 84.31 పాయింట్లు(0.21%) లాభపడి 40,593.80 వద్ద, నిఫ్టీ 16.80 పాయింట్లు(0.14%) 11,931 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 927 షేర్లు లాభాల్లో, 1713 షేర్లు నష్టాల్లో ముగియగా 184 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

30 నెలల్లో మొదటిసారి..
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఐటీసీ, ఇన్ఫోసిస్, యూపీఎల్, ఏషియన్ పేయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్‌టెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, గెయిల్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఉన్నాయి.
యాక్టివ్ స్టాక్స్‌లో విప్రో, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఎస్బీఐ, టీసీఎస్ ఉన్నాయి.
సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా 8వ రోజు రికార్డ్‌స్థాయి లాభాల్లో ముగియడం గత 30 నెలల కాలంలో ఇదే రికార్డ్.
ఓ సమయంలో నిఫ్టీ 12,000 మార్క్‌ను కూడా దాటింది.
ఐటీ స్టాక్స్, ఐటీసీ మార్కెట్ లాభాలకు దోహదపడగా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్ టెల్ మార్కెట్‌ను కిందకు లాగాయి.

2008 తర్వాత ఆ స్టాక్ భారీ పతనం
నిఫ్టీ బ్యాంకు 134 పాయింట్లు దిగజారింది. బ్యాంకింగ్ స్టాక్స్‌లో ఐసీఐసీఐ మాత్రమే లాభపడింది. మిగతా అన్ని స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.
మిడ్ క్యాప్ ఇండెక్స్ 99 పాయింట్లు నష్టపోయింది. వేదాంత, మదర్‌సన్, బీవోబీ టాప్ లూజర్స్‌లో నిలిచాయి.
ఇన్ఫోసిస్ రికార్డ్ స్థాయిలో లాభపడింది. ఈ వారంలో త్రైమాసికం ఫలితాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ లాభాల్లో ఈ స్టాక్ ముగిసింది.
ఐటీసీ స్టాక్ బై-ప్రైస్‌ను సీఎల్ఎస్ఏ అప్ గ్రేడ్ చేసింది. దీంతో ఐటీసీ స్టాక్ రెండు శాతానికి పైగా లాభపడింది.
వేదాంత 20 శాతం నష్టపోయింది. 2008 తర్వాత అత్యంత దారుణంగా ఒకరోజు పతనమైంది ఈ రోజు.
ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కోసం చూడటంతో వేదాంత 6 శాతం నష్టపోయింది.

ఎగిసిన ఐటీ స్టాక్స్
ఐటీ స్టాక్స్ ఈ రోజు అదరగొట్టాయి. టీసీఎస్ 0.47 శాతం లాభపడి 2,826 వద్ద, హెచ్‌సీఎల్ టెక్ షేర్ 1.22 శాతం లాభపడి 866 వద్ద, ఇన్ఫోసిస్ షేర్ 2.93 శాతం లాభపడి 1,139 వద్ద, టెక్ మహీంద్ర షేర్ 0.56 శాతం లాభపడి 859 వద్ద, విప్రో షేర్ ధర 1.47 శాతం లాభపడి 379.50 వద్ద, కోఫోర్జ్ షేర్ ధర 9.57 శాతం లాభపడి రూ.2,702 వద్ద క్లోజ్ అయింది. కోఫోర్జ్ అితే ఏకంగా 236 లాభపడింది.


Click it and Unblock the Notifications