Stock Market: Sensex, Nifty ఉదయం ఊగిసలాట.. సాయంత్రం లాభాల బాట..
Market Closing: ఉదయం ఊగిసలాడిన మార్కెట్లు సాయంత్రానికి సెటిల్ అయ్యాయి. నెగటివ్ స్టార్ట్ చేసినప్పటికీ కీలక సూచీలు చివరికి భారీ లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి. రోజురోజుకూ మార్కెట్లు అంతరీక్షంలోకి రాకెట్లా దూసుకుపోతున్నాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 475 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 146 పాయింట్లు పెరిగింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 518 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 93 పాయింట్ల మేర వృద్ధిని సాధించింది. విరామం లేకుండా మార్కెట్లు కొత్త రికార్డులను బద్ధల కొట్టడం ఇన్వెస్టర్ల బుర్రలు బద్దలకొడుతోంది. ఏ లెక్కన మార్కెట్లు ఇలా విపరీతమైన ర్యాలీని చూస్తున్నయో.. విశ్లేషకుల అంచనాలకు సైతం చిక్కడం లేదు.

అయితే ఎక్కువగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం భారత మార్కెట్లలోకి రావటం మార్కెట్ల రాకెట్ ర్యాలీకి ఒక కారణంగా చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. నేడు ఐటీసీ కంపెనీ తన మార్కెట్ క్యాప్ రూ.6 లక్షల కోట్లను చేరుకుని ప్రఖ్యాత మైలురాయిని అందుకుంది. ఇంట్రాడేలో డాక్టర్ రెడ్డీస్ స్టాక్ 2.9 శాం పెరిగి రెండేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. కంపెనీకి చెందిన శ్రీకాకుళంలోని ఏపీఐ ఫ్యాక్టరీని యూఎస్ ఎఫ్‌డిఏ పరిశీలన తర్వాత సానుకూల స్పందన రావటం తాజా షేర్ పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
NSEలో ఐటీసీ, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, సిప్లా, మారుతీ, టాటా కన్జూమర్, రిలయన్స్, ఎయిర్ టెల్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, హిందుస్థాన్ యూనీలివర్, బీపీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, దివీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, హిందాల్కొ కంపెనీల షేర్లు లాభాల్లో ముగిసి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐషర్ మోటార్స్, బ్రిటానియా, హీరో మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టిఐఎమ్, విప్రో, టైటాన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ టి కంపెనీల షేర్లు నష్టాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications